న్యూఢిల్లీ: ప్రీడమ్ సిరిస్‌లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న నాల్గవ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా నాలుగో రోజు ఆట ప్రారంభమైంది.
రెండో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా:
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 49 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. దక్షిణాఫ్రికా ఓపెనర్ బావుమా (34) అశ్విన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో ఆమ్లా (23), డివిలియర్స్ 11 పరుగులతో ఉన్నారు. దక్షిణాఫ్రికా విజయానికి ఇంకా 432 పరుగులు చేయాల్సి ఉంది. 8 వికెట్లు మిగిలున్నాయి.
తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా:
481 పరుగుల భారీ విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ డీన్ ఎల్గర్‌ను 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్ పెవిలియన్‌కు పంపాడు. లంచ్ విరామ సమయానికి ఒక వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా ఐదు పరుగులు చేసింది.
267 పరుగుల వద్ద భారత్ డిక్లేర్, సఫారీల లక్ష్యం 481
టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను 267 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యం 213 పరుగులను కలుపుకుని దక్షిణాఫ్రికా ముందు 481 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా నిర్దేశించింది. రహానె సెంచరీ అనంతరం భారత్ టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేస్తున్నట్లు ప్రకటించాడు.

రహానె సెంచరీ:
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ అజ్యింకే రహానె సెంచరీ సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో మొత్తం 206 బంతులాడిన రహానే 8 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 100 పరుగులు సాధించాడు. రహానేకు ఇది ఆరో శతకం. తొలి ఇన్నింగ్స్‌లో కూడా రహానె సెంచరీ సాధించాడు.
దూకుడు తగ్గించిన రహానే:
నాలుగో టెస్టు మ్యాచ్‌లో రహానె జోరు తగ్గించాడు. విరాట్ కోహ్లి ఔట్ అయిన తర్వాత రహానె (80) దూకుడుని తగ్గించాడు. ప్రస్తుతం క్రీజులో ఉన్న సాహా(6)తో కలిసి ఎక్కువ సింగిల్స్ తీస్తున్నాడు. దీంతో భారత్ రెండో ఇన్నింగ్స్ 5 వికెట్లు కోల్పోయి 228 పరుగులతో కొనసాగుతోంది. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 441 పరుగులు.
విరాట్ కోహ్లి ఔట్:
టీమిండియా ఆదిలోనే వికెట్‌ను కోల్పోయింది. 190/4 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ జట్టు స్కోరు 211 వద్ద విరాట్ కోహ్లి (88) అబాట్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 424 పరుగులు.
190/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ను టీమిండియా బ్యాట్స్‌మెన్లు విరాట్ కోహ్లి(83), రహానె (52) ఆదివారం ప్రారంభించారు. ఈ టెస్టులో ప్రస్తుతం భారత్ 403 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది.