Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: పింక్ బాల్‌తో భారత్-ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్.. లైవ్, టైమింగ్స్ పూర్తి వివరాలు!

అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ ఘనంగా ఆరంభించింది.పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై 295 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ రేసులో నిలవాలంటే ఈ సిరీస్‌ను తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఆరంభ పోరులో దుమ్మురేపింది. ఆల్‌రౌండ్ షోతో కంగారూలను కంగారు పెట్టించింది. అదే జోరును పింక్ బాల్‌తో జరిగే రెండో టెస్టులోనూ చూపించాలని టీమిండియా పట్టుదలతో సిద్ధమవుతోంది.

ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్‌తో రెండు రోజుల డే/నైట్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌కు సిద్ధమైంది. నేటి నుంచి ఈ వార్మప్ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ మొదటి రోజు ఆటకు వరుణుడు ఆటంకం కలింగించాడు. వర్షం కారణంగా తొలి రోజ ఆట పూర్తిగా రద్దయింది. ఈ నేపథ్యంలో మిగిలిన రెండో రోజు ఆటను వన్డేగా నిర్వహించనున్నారు. పింక్ బాల్‌తో టీమిండియా బౌలింగ్, బ్యాటింగ్ సాధన జరగడం కోసం వన్డే తరహాలో మ్యాచ్‌ను నిర్వహించనున్నట్లు సమాచారం.

India vs Prime Minister s XI Rain Washes Out Day 1 of Warm-Up Game in Canberra Play to Resume Tomorrow

గులాబీ బంతితో నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియాతో భారత్ తలపడిన అడిలైడ్ టెస్టు ఫలితం టీమిండియా అభిమానులకు ఓ పీడకల. ఈ మ్యాచ్‌లో భారత్ 36 పరుగులకు ఆలౌటై అపకీర్త మూటగట్టుకుంది. ఈ క్రమంలో డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగానే జరగనున్న రెండో టెస్టు‌పై సర్వత్రా ఆసక్తి పెరిగింది. మరోవైపు భారత్ పట్టుదలతో పింక్ బాల్‌తో ప్రాక్టీస్ చేస్తోంది. ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ 11తో జరిగే వార్మప్ మ్యాచ్‌ను సద్వినియోగం చేసుకోవాలని భావించింది. కానీ తొలి రోజు ఆట వర్షార్పణం అయ్యింది.

భారత కాలమానం ప్రకారం ఉదయం 9.10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ రెండు రోజుల వార్మప్ మ్యాచ్‌ను అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. హాట్ స్టార్‌తో పాటు స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్‌లో ఈ మ్యాచ్ లైవ్ రానుంది.

భారత జట్టు: కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్(కీపర్), ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, జస్‌ప్రీత్ బుమ్రా(కెప్టెన్), మహమ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, సర్ఫరాజ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, రవీంద్ర జడేజా, అభిమన్యు ఈశ్వరన్

ప్రైమ్‌ మినిస్టర్స్ ఎలెవన్: జాక్ ఎడ్వర్డ్స్(కెప్టెన్), చార్లీ అండర్సన్, మహిల్ బియర్డ్‌మన్, స్కాట్ బోలాండ్, జాక్ క్లేటన్, ఎయిడన్ ఓ కోన్నర్, ఓలీ డేవిస్, జయ్‌డెన్ గుడ్విన్, సామ్ హర్పర్, హన్నో జాకోబ్స్, సామ్ కోన్‌స్టాస్, లాయ్ పోప్, మాథ్యూ రేన్‌షా, జేమ్ ర్యాన్.

Story first published: Saturday, November 30, 2024, 15:13 [IST]
Other articles published on Nov 30, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+