అడిలైడ్: చిరకాల ప్రత్యర్ధులైన భారత్-పాకిస్ధాన్ జట్ల మధ్య ఆదివారం అడిలైడ్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్ధాన్‌ను భారత్ ఓడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ జరుగుతుండగా, పాక్ పాకిస్ధాన్ ముస్లిం లీగ్ యూత్ వింగ్‌లో పనిచేస్తున్న అస్లాం ఖాన్ తనోలి అనే యువకుడు ఉదయం 11 గంటలకు మ్యాచ్ ఫలితాన్ని, ఏ జట్టు ఎంత స్కోరు చేస్తుందో కూడా తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.
భారత్ సరిగ్గా 300 పరుగులు, పాకిస్ధాన్ 220 పరుగులు చేస్తుందని, మ్యాచ్ చివర్లో 5 ఫోర్లు వస్తాయని, ఈ అంకెల్లో ఎలాంటి తేడా ఉండని తాను ఛాలెంజింగ్ చేస్తున్నట్లు ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. అతను చేసిన ట్వీట్ అంకెలకు చాలా దగ్గరగా భారత్ - పాక్ జట్ల స్కోర్లు ఉండటం అభిమానుల్లో కొన్ని ప్రశ్నలు ఉదయించేలా చేస్తోంది.

అస్లాం ఖాన్ తనోలి అనే యువకుడు అంత ఖచ్చితంగా భారత్ - పాక్ మ్యాచ్ స్కోర్లు ఎలా చెప్పాడనే ప్రశ్న హాట్ టాపిక్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో ఫిక్సింగ్ జరిగిందనే అనుమానాలను కొందరు అభిమానులు లేవనెత్తారు.
ఏదైతేనేం పాకిస్ధాన్‌పై టీమిండియా గెలిచి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. అడిలైడ్‌లో ఆదివారం నాడు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా మొదట విరాట్ కోహ్లీ 107 పరుగులతో సెంచరీ సాధించాడు. అతనికి తోడుగా శిఖర్ ధావన్ 73, సురేష్ రైనా 74 మెరుపులు తోడవడంతో భారత్ 7 వికెట్ల నష్టానికి 300 పరుగులు సాధించింది.
301 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్ధాన్ 224 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ మిస్బావుల్ హక్ 76 ఒంటరి పోరాటం చేశాడు. విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపకయ్యాడు.