భారత్ చేతిలో ఘోర పరాజయం.. ముఖం చాటేసిన పాక్ ఛానెల్! (వీడియో)
మహిళల టీ20 వరల్డ్ కప్ 2026లో భారత మహిళల క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టిస్తూ.. తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పాక్‌ను చిత్తు చేసింది. భారత ఓపెనర్ స్మృతి మంధాన, వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడగా.. బౌలింగ్‌లో దీప్తి శర్మ, శ్రీచరణి జోడీ పాకిస్థాన్ బ్యాటర్లను వణికించారు. ఈ విజయంతో భారత జట్టు టోర్నీలో తమ ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించింది.
ఘోర ఓటమి.. లైవ్ మ్యాచ్ మార్చేసిన పాక్ ఛానెల్
పాకిస్థాన్‌లో మహిళల టీ20 ప్రపంచ కప్ అధికారిక బ్రాడ్‌కాస్టింగ్ హక్కు 'పీటీవీ' ఛానెల్ వద్ద ఉన్నాయి. అదే సమయంలో ఈ ఛానెల్‌కు ఫిఫా వరల్డ్ కప్ ప్రసార హక్కులు కూడా ఉన్నాయి. అయితే భారత్ చేతిలో పాక్ ఘోర ఓటమి వైపు దూసుకెళ్తుండడాన్ని తట్టుకోలేక.. పీటీవీ యాజమాన్యం లైవ్ మ్యాచ్‌ను అర్ధాంతరంగా నిలిపివేసింది. క్రికెట్ మ్యాచ్ స్థానంలో జర్మనీ, కురాకోల మధ్య జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను ప్రసారం చేయడం ప్రారంభించింది. దీనికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఓ పాకిస్థానీ యూట్యూబర్ చేసిన వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది.

రిచా ఘోష్ విధ్వంసం
మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో భారత్, పాకిస్థాన్ దేశాలకు ఇదే మొదటి మ్యాచ్ కావడం గమనార్హం. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగుల భారీ స్కోరు చేసింది. ముఖ్యంగా చివరి రెండు ఓవర్లలో భారత బ్యాటర్లు ఏకంగా 38 పరుగులు రాబట్టారు. ఇందులో రిచా ఘోష్ కేవలం 17 బంతుల్లో 34 పరుగులు చేసి మెరుపులు మెరిపించింది. అంతకుముందు ఓపెనర్ స్మృతి మంధాన 44 బంతుల్లో 68 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగా.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 36 పరుగులతో రాణించింది.
ముంచేసిన దీప్తి శర్మ
అనంతరం 171 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు భారత బౌలర్ల దాటికి కేవలం 17 ఓవర్లలోనే 106 పరుగులకు ఆలౌట్ అయింది. రన్స్ పరంగా మహిళల టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టుకు ఇది ఐదో అతిపెద్ద విజయం. భారత స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ 4 ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి పాక్ నడ్డి విరిచింది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఓ భారతీయ బౌలర్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. అలాగే ఈ మ్యాచ్‌తో టీ20 ప్రపంచకప్‌లోకి అరంగేట్రం చేసిన శ్రీ చరణి కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications