Womens ODI World Cup 2025: మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025 సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 మధ్య భారత్, శ్రీలంకలో జరగనుంది. భారత మ్యాచ్‌ల షెడ్యూల్ సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇందులో ఎక్కువగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ తేదీ గురించి చర్చ జరుగుతోంది.పహల్గామ్ దాడి తర్వాత భారత్ పాకిస్థాన్‌పై వైమానిక దాడి చేసింది. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. దీని తర్వాత భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్లు మొదటి సారి ముఖాముఖి తలపడనున్నాయి. మరి ఎప్పుడు తలపడనున్నాయో తెలుసుకుందాం.
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?
భారత్, పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్ల మధ్య జరిగే ఈ ప్రపంచ కప్ మ్యాచ్ అక్టోబర్ 5న జరగనుంది. మహిళల ప్రపంచ కప్ 2025లో భాగంగా భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో జరగనుంది.

మహిళల ప్రపంచ కప్ 2025 పూర్తి షెడ్యూల్ ఇదే..
*సెప్టెంబర్ 30: భారతదేశం vs శ్రీలంక - బెంగళూరు - మధ్యాహ్నం 3 గంటలు
*అక్టోబర్ 1: ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్ - ఇండోర్ - మధ్యాహ్నం 3 గంటలు
*అక్టోబర్ 2: బంగ్లాదేశ్ vs పాకిస్తాన్ - కొలంబో - మధ్యాహ్నం 3 గంటలు
*అక్టోబర్ 3: ఇంగ్లాండ్ vs దక్షిణాఫ్రికా - బెంగళూరు - మధ్యాహ్నం 3 గంటలు
*అక్టోబర్ 4: ఆస్ట్రేలియా vs శ్రీలంక - కొలంబో - మధ్యాహ్నం 3 గంటలు
*అక్టోబర్ 5: భారతదేశం vs పాకిస్తాన్ - కొలంబో - మధ్యాహ్నం 3 గంటలు
*అక్టోబర్ 6: న్యూజిలాండ్ vs దక్షిణాఫ్రికా - ఇండోర్ - మధ్యాహ్నం 3 గంటలు
*అక్టోబర్ 7: ఇంగ్లాండ్ vs బంగ్లాదేశ్ - గౌహతి - మధ్యాహ్నం 3 గంటలు
*అక్టోబర్ 8: ఆస్ట్రేలియా vs పాకిస్తాన్ - కొలంబో - మధ్యాహ్నం 3 గంటలు
*అక్టోబర్ 9: భారతదేశం vs దక్షిణాఫ్రికా - వైజాగ్ - మధ్యాహ్నం 3 గంటలు
*అక్టోబర్ 10: న్యూజిలాండ్ vs బంగ్లాదేశ్ - వైజాగ్ - మధ్యాహ్నం 3 గంటలు
*అక్టోబర్ 11: ఇంగ్లాండ్ vs శ్రీలంక - గౌహతి - మధ్యాహ్నం 3 గంటలు
*అక్టోబర్ 12: భారతదేశం vs ఆస్ట్రేలియా- వైజాగ్- మధ్యాహ్నం 3 గంటలు
*అక్టోబర్ 13: దక్షిణాఫ్రికా vs బంగ్లాదేశ్- వైజాగ్- మధ్యాహ్నం 3 గంటలు
*అక్టోబర్ 14: న్యూజిలాండ్ vs శ్రీలంక- కొలంబో- మధ్యాహ్నం 3 గంటలు
*అక్టోబర్ 15: ఇంగ్లాండ్ vs పాకిస్తాన్- కొలంబో- మధ్యాహ్నం 3 గంటలు
*అక్టోబర్ 16: ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్- వైజాగ్- మధ్యాహ్నం 3 గంటలు
*అక్టోబర్ 17: దక్షిణాఫ్రికా vs శ్రీలంక- కొలంబో- మధ్యాహ్నం 3 గంటలు
*అక్టోబర్ 18: న్యూజిలాండ్ vs పాకిస్తాన్- కొలంబో- మధ్యాహ్నం 3 గంటలు
*అక్టోబర్ 19: ఇండియా vs ఇంగ్లాండ్- ఇండోర్- మధ్యాహ్నం 3 గంటలు
*అక్టోబర్ 20: శ్రీలంక vs బంగ్లాదేశ్- కొలంబో- మధ్యాహ్నం 3 గంటలు
* అక్టోబర్ 21: దక్షిణాఫ్రికా vs పాకిస్తాన్- కొలంబ- మధ్యాహ్నం 3 గంటలు
*అక్టోబర్ 22: ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్- ఇండోర్- మధ్యాహ్నం 3 గంటలు
*అక్టోబర్ 23: ఇండియా vs న్యూజిలాండ్- గువాహటి- మధ్యాహ్నం 3 గంటలు
*అక్టోబర్ 24: పాకిస్తాన్ vs శ్రీలంక - కొలంబో - మధ్యాహ్నం 3 గంటలు
*అక్టోబర్ 25: ఆస్ట్రేలియా vs శ్రీలంక - ఇండోర్ - మధ్యాహ్నం 3 గంటలు
*అక్టోబర్ 26: ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్ - గౌహతి - ఉదయం 11 గంటలు
*అక్టోబర్ 26: ఇండియా vs బంగ్లాదేశ్ - బెంగళూరు - మధ్యాహ్నం 3 గంటలు
*అక్టోబర్ 29: సెమీ-ఫైనల్ 1 - గౌహతి/కొలంబో - మధ్యాహ్నం 3 గంటలు
*అక్టోబర్ 30: సెమీ-ఫైనల్ 2 - బెంగళూరు - మధ్యాహ్నం 3 గంటలు
*నవంబర్ 2: ఫైనల్ - కొలంబో/బెంగళూరు - మధ్యాహ్నం 3 గంటలు