కోల్‌కత్తా: వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం ఎప్పుడూ మీడియాలో ఉండే ముంబై మోడల్ అర్షి ఖాన్ తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అయితే ఈ వ్యాఖ్యలు ఐసీసీ వరల్డ్ టీ20 టోర్నమెంట్‌లో హై ఓల్టేజ్ మ్యాచ్‌గా పేర్కొంటున్న భారత్-పాక్ మ్యాచ్‌ని ఉద్దేశించి చేయడం విశేషం.
టోర్నీలో భాగంగా మార్చి 19 (శనివారం)నాడు కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్-పాకిస్ధాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే తన శరీరం వెనుక భాగాన్ని చూపిస్తానంటూ పేర్కొంది. అదేవిధంగా ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ షాహిది అఫ్రిదీ సెంచరీ సాధిస్తే తన శరీర ముందు భాగాన్ని చూపిస్తానంటూ ట్విట్టర్‌లో తన సందేశాన్ని ట్వీట్ చేశారు.
భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా ట్విట్టర్‌లో ట్వీట్ చేయడం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. ఇటీవలే అఫ్రిదీ వల్లే తాను గర్భవతిని కూడా అయ్యానని కూడా చెప్పుకొచ్చారు. వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి యావత్ ప్రపంచానికి తెలిసేలా అర్షి ఖాన్ ఓ వీడియాని కూడా విడుదల చేశారు.
అఫ్రిదీతో తాను సెక్స్‌లో పాల్గొన్నట్లు, ప్రస్తుతం తాను మూడు నెలల గర్భం దాల్చినట్లు తెలిపారు. అయితే విమర్శకులు మాత్రం అర్షి ఖాన్ కేవలం మీడియా దృష్టిని ఆకర్షించేందుకే ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. అయితే, ఆమె వ్యాఖ్యలపై పాకిస్థాన్‌లోని ఓ వర్గం మతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాదు ఫత్వా కూడా జారీ చేశారు. అయితే ఈ ఫత్వాపై అర్షి ఖాన్ కూడా ఘాటుగానే స్పందించారు. పాకిస్థాన్ తీరు నాకు ఏ మాత్రం నచ్చలేదని, చాలా దారుణంగా ఉందని మండిపడ్డారు. తనకు ఎంతో నిరాశను కలిగించిందన్నారు. తనకు వ్యతిరేకంగా ఫత్వా జారీ అయినా ఇంత వరకు తనకు మద్దతుగా ఏ ఒక్కరూ మాట్లాడలేదన్నారు.