For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ కారెక్టర్: ఆఫ్రిదీతో ముచ్చెట, అమీర్‌కు బ్యాట్

By Pratap

కోల్‌కతా: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తన తన వ్యక్తిత్వాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా శనివారం పాకిస్తాన్, భారత జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు జట్టు శుక్రవారం మైదానంలో పాక్టీస్ చేశాయి.

ఈ ప్రాక్టీస్ సందర్బంగా మైదానంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. విరాట్ కోహ్లీ, పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ అఫ్రీది సరదాగా ముచ్చటించుకున్నారు. వీరి సంభాషణ పూర్తయ్యే ముందుగా అక్కడకి దగ్గరలో ప్రాక్టీస్ చేస్తున్న అమీర్‌ను కోహ్లీ పిలిచాడు.

India vs Pakistan: Virat Kohli presents bat to Mohammad Amir

ఓ బ్యాట్‌ను కోహ్లీ అమీర్‌కు బహుమతిగా ఇచ్చాడు. ఆ బ్యాట్‌తోనే అమీర్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. అంతేకాదు, పాక్‌కు సంబంధించిన ఇతర ఆటగాళ్లు కూడా ఆ బ్యాట్‌ను తీసుకుని సరదాగా ప్రాక్టీస్ చేశారు. పోటీ అనేది కేవలం ఆటలో మాత్రమేనని, వ్యక్తిగతంగా ఉండకూడదని కోహ్లీ నిరూపించాడు.

ఈ వీడియో ఇప్పుడు నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. అమీర్‌పై గతంలో కూడా కోహ్లీ తన ఇష్టాన్ని వ్యక్తపరిచిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ ఇచ్చిన బ్యాట్‌తోనే మ్యాచ్ అడుతానని కూడా అమీర్ చెప్పాడు. ఆసియా కప్‌ పోటీల్లో భాగంగా తమపై జరిగిన మీర్పూర్ మ్యాచులో 18 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నందుకు అమీర్‌ను కోహ్లీ ప్రశంసించాడు కూడా.

ఆసియా కప్ పూర్తయిన తర్వాత అమీర్ కోహ్లీని కలిసి తనకు ఓ బ్యాట్ బహుమతిగా ఇవ్వాలని అడిగినట్లు సమాచారం.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+