దుబాయ్ వేదికగా నేడు (డిసెంబర్ 14) భారత్, పాకిస్తాన్ అండర్-19 జట్ల మధ్య ఆసియా కప్ పోరు జరగుతోంది. ఐసీసీ అకాడమీ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి నెలకొంది. తొలి మ్యాచ్‌లో అతని విధ్వంసక ప్రదర్శన తర్వాత ఈ ఉదయం జరగబోయే హై-వోల్టేజ్ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆయుష్ మాత్రే నేతృత్వంలోని భారత అండర్-19 జట్టు, చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడుతోంది. ఉదయం 10 గంటలకు పడాల్సిన టాస్ ఆలస్యమైంది. వర్షం కారణంగా టాస్ ఆలస్యం అయింది.
ఇరు జట్ల జైత్రయాత్ర
భారత్ తన ఆసియా కప్ అండర్-19 టోర్నమెంట్‌ను ఘనంగా ప్రారంభించింది. మొదటి మ్యాచ్‌లో ఆతిథ్య యూఏఈని 234 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి తమ బ్యాటింగ్, బౌలింగ్ బలాన్ని ప్రదర్శించింది. మరోవైపు పాకిస్తాన్ కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉంది. తమ మొదటి మ్యాచ్‌లో మలేషియాను 297 పరుగుల భారీ తేడాతో ఓడించి బలంగా కనిపిస్తోంది.

వైభవ్ సూర్యవంశీపై పాకిస్థాన్‌కు భయం
తొలి మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ చేసిన భారీ స్కోరు (171 పరుగులు) తర్వాత నేటి మ్యాచ్‌లో కూడా అతని నుంచి మరో విధ్వంసక ఇన్నింగ్స్‌ను అభిమానులు ఆశిస్తున్నారు. పాకిస్తాన్ బౌలర్లకు వైభవ్ రూపంలో పెద్ద సవాలు ఎదురుకానుంది.
లైవ్ ఎక్కడ చూడాలి?
భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను నేరుగా వీక్షించడానికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి. భారత్‌లో ఈ మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెళ్లలో చూడవచ్చు. ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ SonyLiv యాప్, వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటుంది.
ఇరు జట్ల స్క్వాడ్ వివరాలు
భారత U19 జట్టు: ఆయుష్ మాత్రే(కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు(w), కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, దీపేష్ దేవేంద్రన్, కిషన్ కుమార్ సింగ్, హెనిల్ పటేల్, హర్వంశ్ మోహన్ పంగాలియా, యురాజ్ మోహన్ పంగాలియా, యురాజ్ గోష్పాక్
పాకిస్థాన్ U19 స్క్వాడ్: ఉస్మాన్ ఖాన్, సమీర్ మిన్హాస్, అలీ హసన్ బలోచ్, అహ్మద్ హుస్సేన్, ఫర్హాన్ యూసఫ్(సి), హంజా జహూర్(w), హుజైఫా అహ్సన్, నిఖాబ్ షఫీక్, డానియాల్ అలీ ఖాన్, మహ్మద్ సయ్యమ్, అలీ రజా, అబ్దుల్ సుభాన్, మొహమ్మద్ హుహమ్, అబ్దుల్ సుభాన్, మొహమ్మద్ షహమ్.