Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అట్టర్ ఫ్లాప్: పాకిస్థాన్ ముందు చేతులెత్తేసిన బుడ్డోడు!

India vs Pakistan: అండర్-19 ఆసియా కప్ 2025లో పాకిస్థాన్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ పూర్తిగా నిరాశపరిచాడు. భారత్, పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా మొదట బ్యాటింగ్ ప్రారంభించింది. అందరి దృష్టి గత మ్యాచ్ సెంచరీ హీరో వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. గత మ్యాచ్‌లో యూఏఈపై 171 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ సూర్యవంశీ పాక్ బౌలర్ల ముందు తన మ్యాజిక్‌ను చూపించలేకపోయాడు.

దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. వైభవ్ సూర్యవంశీ ఒక బౌండరీతో మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించినప్పటికీ.. కేవలం 6 బంతులు మాత్రమే ఆడి పెవిలియన్ చేరాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో మహ్మద్ సయ్యమ్ వేసిన రెండో బంతి నెమ్మదిగా రావడంతో దాన్ని డిఫెన్స్ చేయబోయిన వైభవ్ సూర్యవంశీ.. బంతిని నేరుగా బౌలర్ సయ్యమ్‌కే చాలా సులువైన క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. వైభవ్ సూర్యవంశీ 6 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ప్రతీ మ్యాచ్‌లో పరుగులు చేయడం సులువు కాదని చెప్పినప్పటికీ, కీలకమైన పాకిస్థాన్ మ్యాచ్‌లో అతని ఔట్ భారత అభిమానులను కలచివేసింది.

India vs Pakistan U19 Asia Cup 2025 Vaibhav Suryavanshi Fails After Century Heroics

కెప్టెన్ ఆయుష్ మాత్రే మెరుపు ఇన్నింగ్స్.. కానీ..!
వైభవ్ సూర్యవంశీ త్వరగా ఔటైనప్పటికీ, కెప్టెన్ ఆయుష్ మాత్రే అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టుకు మెరుపు ఆరంభం అందించాడు. ఆయుష్ మాత్రే కేవలం 25 బంతుల్లో 38 పరుగులు చేశాడు.ఈ మెరుపు ఇన్నింగ్స్‌లో 3 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి. మహ్మద్ సయ్యమ్ బౌలింగ్‌లోనే భారీ షాట్ ఆడబోయి ఆయుష్, హమ్జా జహూర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో అతని అద్భుతమైన ఇన్నింగ్స్‌కు తెరపడింది.

అండర్-19 టీమిండియా ప్లేయింగ్ 11:
అండర్-19 ఆసియా కప్ 2025లో యూఏఈపై 234 పరుగుల భారీ విజయం సాధించిన తర్వాత, జట్టు నాయకత్వం ప్లేయింగ్ 11లో ఎలాంటి మార్పులు చేయకూడదని నిర్ణయించుకుంది. పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11 ఈ విధంగా ఉంది.

భారత అండర్-19 జట్టు: ఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), ఖిలాన్ పటేల్, దీపేష్ దేవేంద్రన్, కిషన్ కుమార్ సింగ్, హేనిల్ పటేల్, కనిష్క్ చౌహాన్.

Story first published: Sunday, December 14, 2025, 13:18 [IST]
Other articles published on Dec 14, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+