India vs Pakistan : ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌లో పాక్ కొంపముంచిన టాప్ 6 కారణాలు ఇవే..!

ఆసియా కప్ 2022 గ్రూప్ Aమ్యాచ్‌లో భారత్‌ను ఓడించేందుకు ఉన్న అన్ని అవకాశాలు పాకిస్థాన్ చేజేతులా పోగొట్టుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించడంలో పాకిస్థాన్ ప్లేయర్లు చేసిన తప్పులు కీలకమయ్యాయి. ఆ జట్టు ప్లేయర్ల చిన్న చిన్న మిస్టేక్సే కొంపముంచాయి. అయితే భారత ప్లేయర్లు మాత్రం దొరికిన చిన్న చిన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని గెలుపు గీత దాటారు. చివర్లో హార్దిక్ పాండ్యా 17బంతుల్లో 33 పరుగులతో వీరోచితంగా ఆడడంతో ఇండియా 5వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే పాక్ చేసిన కొన్ని మిస్టేక్స్ ఓసారి గమనిస్తే..

షార్ట్-పిచ్ బంతులు ఎదుర్కోలేక వికెట్లు కోల్పోవడం
షార్ట్-పిచ్ బౌలింగ్‌ను పాకిస్తాన్ బ్యాటర్లు సరిగా ఎదుర్కోలేకపోయారు. భారత బౌలర్లు భువీ, అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా నిఖార్సైన షార్ట్ పిచ్ బంతులేస్తూ పాక్ బ్యాటర్లపై ఆధిపత్యం చెలాయించారు. భువనేశ్వర్ కుమార్ షార్ట్ పిచ్ బంతితో బాబర్ ఆజామ్‌ను పెవిలియన్‌కు పంపించగా.. హార్దిక్ పాండ్యా మహ్మద్ రిజ్వాన్‌ను షార్ట్ పిచ్ బంతితో బురిడీ కొట్టించాడు. ఖుష్దిల్ షా, ఫఖర్ జమాన్ కూడా షార్ట్ పిచ్ బంతులకే ఔటయ్యారు.

బ్యాటింగ్ స్థానాల్లో సరైన ప్లాన్ లేకపోవడం
ఆ జట్టు వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ తొలుత సింగిల్స్ ఆడి కుదురుకున్నాక హిట్ చేసే ప్లేయర్. అయితే అతన్ని ఈ మ్యాచ్‌లో నంబర్ 6 స్థానంలో దింపారు. వచ్చీ రాగానే హిట్ చేయాల్సిన గత్యంతర పరిస్థితుల్లో అతను ఔటయిపోయాడు. ఆశ్చర్యకరంగా ఇఫ్తికర్ అహ్మద్‌ను నెం.4 స్థానంలో బ్యాటింగ్‌కు దింపారు.. అయితే స్వతహాగా డౌన్ ఆర్డర్లో దిగే అతన్ని ముందే పంపించడం పాక్‌కు అంత పెద్దగా వర్కౌట్ కాలేదు. షాదాబ్ ఖాన్ నంబర్ 4లో, ఇఫ్తికర్ నంబర్ 6లో బరిలోకి దిగాల్సింది.

క్యాచ్‌లు జారవిడిస్తే మ్యాచ్‌లను జారవిడిచినట్లే
విరాట్ కోహ్లీ తన రెండో బంతికే నషీమ్ షా బౌలింగ్లో థర్డ్ స్లిప్‌లో ఉన్న ఫాఖర్ జమాన్ చేతికి చిక్కాల్సింది. కానీ ఫాఖర్ జమాన్ తక్కువ స్థాయి స్లిప్ ఫీల్డింగ్‌తో ఆ క్యాచ్ అందుకోలేకపోయాడు. దీంతో కోహ్లీ కీలకమైన 35పరుగులు చేశాడు. అవి జట్టుకు ఎంతో ఉపయోగపడ్డాయి. ఒకవేళ ఆ క్యాచ్ పట్టుంటే.. రెండు వికెట్లు కోల్పోయిన భారత్ మరింత ఒత్తిడికి గురై మ్యాచ్ పరిస్థితి వేరే విధంగా ఉండేది.

మిస్ ఫీల్డింగ్
హార్దిక్ వచ్చీ రాగానే గల్లీ దిశగా ఓ ఫోర్ బాదాడు. అయితే అది ఫీల్డర్ ఈజీగా ఆపగలిగేదే కానీ మిస్ ఫీల్డింగ్ ద్వారా 4పరుగులు వచ్చేశాయి. అలాగే భారత్‌కు 12 బంతుల్లో 21పరుగులు అవసరమైనప్పుడు.. బౌండరీ వద్ద బాబర్ ఆజామ్ కూడా మిస్ ఫీల్డ్ చేయడంతో ఫోర్ వచ్చింది. ఆ బంతి ఆపి ఉంటే 2పరుగులు మిగిలేవి.

రిజ్వాన్ ఎక్స్ ట్రాలు
వికెట్‌కీపర్ మహ్మద్ రిజ్వాన్ అత్యుత్సాహం ప్రదర్శించడం కూడా కొంత పాక్‌ను నెగెటివ్ అయిందనే చెప్పాలి. అతను షానవాజ్ దహానీ, హరీస్ రవూఫ్ వేసిన 16వ మరియు 17వ ఓవర్‌లలో ఐదు ఎక్స్‌ట్రా పరుగులకు కారణమయ్యాడు. వైడ్ బంతులను అందుకోలేకపోయాడు. దీంతో వైడ్ ప్లస్ రన్స్ వచ్చాయి. అతను ఓ దశలో కాలి నొప్పితో బాధపడ్డ సంగతి తెలిసిందే.

స్పిన్నర్ నవాజ్‌ను సరిగ్గా ఉపయోగించుకోకపోవడం
చివరి ఏడు ఓవర్లలో రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్ బరిలో ఉండగా భారత విజయానికి 65పరుగులు అవసరముంది. ఇక అప్పుడు నవాజ్ మరో ఓవర్ వేయాల్సి ఉంది. షాదాబ్ ఖాన్ తన 4ఓవర్ల కోటాను పూర్తి చేయగా.. స్పిన్ విభాగంలో నవాజ్‌కు ఇంకో ఓవర్ మిగిలి ఉంది. పైగా పాక్‌కు ఎక్స్ ట్రా బౌలర్ కూడా లేడు. అయితే బాబర్ మాత్రం 14వ ఓవర్ నుంచి పేసర్లు దహానీ, నసీమ్, రౌఫ్‌తో బౌలింగ్ వేయించాడు. దీంతో చివరి ఓవర్ నవాజ్ వేయాల్సి రావడం.. ఆ ఓవర్లో 7పరుగులను అతను డిఫెండ్ చేయలేకపోవడం జరిగిపోయాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications