ఆసియా కప్‌లో ఇండియా Vs పాక్: భారత్ నెగ్గిన అత్యుత్తమ మ్యాచ్‌లివే

హైదరాబాద్: ఆసియా కప్‌లో ఎన్ని మ్యాచ్‌లు జరిగినా భారత్-పాక్ మ్యాచ్‌కు ఉండే ప్రత్యేకతే వేరు. ఆసియా కప్ షెడ్యూల్ విడుదలైనప్పట్నించి ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాలకు చెందిన అభిమానులు ఎంతో ఆసిక్తిగా ఎదురు చూస్తున్నారు. టోర్నీలో భాగంగా మంగళవారం హాంకాంగ్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న టీమిండియా... ఆ తర్వాతి రోజైన బుధవారం పాకిస్థాన్‌తో అమీతుమీత తేల్చుకోనుంది.
రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో ఆసియా కప్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహారించనున్నాడు. దీంతో ఈ టోర్నీలో టీమిండియా ఎలా ఆడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. బ్యాట్స్‌మన్‌గా ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మకు కెప్టెన్‌గా ఇది కఠిన పరీక్షే. ఈ టోర్నీలో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది.
చివరిసారిగా భారత్-పాక్‌లు గతేడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడ్డాయి. ఓవల్ వేదికగా జరిగిన ఫైనల్లో టీమిండియాను చిత్తుగా ఓడించిన పాక్ దానిని మళ్లీ పునరావృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ టోర్నీలో భారత్-పాక్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌లు (ఫైనల్‌తో కలిపి) జరిగే అవకాశం ఉంది.
బుధవారం భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఆసియా కప్ టోర్నీలో గతంలో భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ హైలెట్స్ మీకోసం...

మార్చి, 2, 2014, ఢాకా - భారత్‌పై పాకిస్తాన్ వికెట్ తేడాతో విజయం
ఢాకా పిచ్ స్లో పిచ్ కావడంతో ఇరు జట్లలోని స్పిన్నర్లు ఈ మ్యాచ్‌లో చెలరేగారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలతో పాటు రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీలు చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 245 పరుగులు చేసింది. చివరి 2 ఓవర్లలో పాకిస్థాన్ విజయానికి 13 పరుగులు అవసరం కాగా... 49వ ఓవర్‌ని భువనశ్వర్ కుమార్ వేశాడు. ఈ ఓవర్‌లో భువీ కేవలం మూడు పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 50వ ఓవర్ వేసేందుకు గాను బంతిని అశ్విన్ చేతికి ఇచ్చాడు.

తొలి బంతికే వికెట్ తీసిన అశ్విన్
తొలి బంతికే అశ్విన్ పాక్ బ్యాట్స్‌మన్ అజ్మల్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో 7 బంతుల్లో కేవలం మూడు పరుగులు చేసిన పాక్ మూడు వికెట్లను కోల్పోయింది. దీంతో విజయం భారత్‌దే అని అంతా భావించారు. అయితే, తర్వాతి బంతికి సింగిల్ తీయడంతో క్రీజులోకి షాహిద్ అఫ్రిది వచ్చాడు. అశ్విన్ వేసిన షార్ట్ పిచ్ బంతిని డీప్ ఎక్స్‌ట్రా కవర్ మీదుగా సిక్సుగా మలిచే ప్రయత్నం చేశాడు. అయితే బంతి మొదటే నేలకు తగలడంతో అంఫైర్ దానిని ఫోర్‌గా ఇచ్చాడు. ఆ తర్వాత బంతిని కూడా అఫ్రిది ఫోర్‌గా మలిచాడు. దీంతో లక్ష్యం చిన్నపోయింది. దీంతో పాకిస్థాన్ ఒక్క వికెట్ తేడాతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది.

మార్చి 18, 2012, ఢాకా - పాక్‌పై 6 వికెట్ల తేడాతో భారత్ విజయం
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నసిర్ జంషెడ్(112), మహమ్మద్ హఫీజ్(105) సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 329 పరుగులు చేసింది. భారీ లక్ష్యం కావడం, దీనికి తోడు భారత బ్యాటింగ్‌లో గౌతం గంభీర్ రెండో బంతికి పెవిలియన్‌కు చేరడంతో ఈ మ్యాచ్‌లో గెలుపు మాదేనని పాకిస్థాన్ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. అంతకముందు పాక్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో 16, 18, 19 పరుగులే చేయడంతో విరాట్ కోహ్లీని పెద్దగా పాక్ బౌలర్లు పరిగణనలోకి తీసుకోలేదు. అయితే, ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 148 బంతుల్లో 22 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో 183 పరుగులు చేసి భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు ఆసియా కప్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

జూన్ 26, 2008 - కరాచీ - పాక్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ షోయబ్ మాలిక్ 16 ఫోర్లు ఒక సిక్సుతో 125 పరుగులు సాధించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 299 పరుగులు చేసింది. అనంతరం 300 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్ గౌతం గంభీర్ వికెట్‌ను ఆదిలోనే కోల్పోవడంతో కష్టాల్లో పడింది. అయితే మరో ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 95 బంతుల్లో 119 పరుగులతో సెంచరీ నమోదు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. సురేశ్ రైనా కూడా ఈ మ్యాచ్‌లో 69 బంతుల్లో 84 పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 198 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అనంతరం క్రీజులోకి వచ్చిన యువరాజ్ (48), ధోని (26 నాటౌట్) రాణించడంతో 42.1 ఓవర్లలోనే భారత్ విజయాన్ని అందుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications