భారత్‌ను ఓడించే 'సీక్రెట్ రెసిపీ' ఇదే!
IND vs PAK: భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే క్రికెట్ పోరు అంటేనే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. 2026 టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం జరగనున్న ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు పాక్ మాజీ దిగ్గజం షాహిద్ అఫ్రిది తన దేశ జట్టుకు దిశానిర్దేశం చేశారు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని టీమిండియాను కట్టడి చేసేందుకు ఆయన రూపొందించిన ఈ మాస్టర్ ప్లాన్ ఇప్పుడు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
అతి జాగ్రత్తే అసలు వ్యూహం
సాధారణంగా మైదానంలో అగ్రెసివ్ ఆటతీరుకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే అఫ్రిది.. ఈ కీలక పోరు విషయంలో మాత్రం పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాకు ఆసక్తికరమైన సలహా ఇచ్చారు. భారత్ వంటి మేటి జట్టును ఓడించాలంటే కేవలం బంతిని బలంగా బాదడం మాత్రమే సరిపోదని, అత్యంత జాగ్రత్తగా ఆడటం అవసరమని ఆయన పేర్కొన్నారు. కేవలం మెరుపులు మెరిపించడం కంటే, ప్రతి ఓవర్‌లోనూ క్రమశిక్షణతో కూడిన వ్యూహాలను అమలు చేయడమే విజయానికి అసలైన రహస్యమని షాహిద్ అఫ్రిది విశ్లేషించారు.

అలా చేసిన వారిదే విజయం
అధిక ఒత్తిడి ఉండే ఇలాంటి మ్యాచ్‌ల్లో మెరుపులు మాయాజాలం కంటే బేసిక్స్ మీద పట్టు సాధించడం ముఖ్యమని షాహిద్ అఫ్రిది అభిప్రాయపడ్డారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అనే మూడు కీలక విభాగాల్లో ఏ జట్టు అయితే తక్కువ తప్పులు చేస్తుందో.. వారికే గెలుపు అవకాశాలు మెండుగా ఉంటాయని ఆయన తేల్చి చెప్పారు. మైదానంలో ఎంత ప్రశాంతంగా ఉంటే, అంతగా మెరుగైన ఫలితాలు వస్తాయని ఆయన పాక్ ఆటగాళ్లకు సూచించారు.
అదే పాక్ ఆయుధం
ప్రస్తుత పాకిస్థాన్ జట్టులో ఎనిమిదో నంబర్ వరకు బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉన్న ఆటగాళ్లు ఉండటం ఆ జట్టుకు అతిపెద్ద సానుకూలాంశమని షాహిద్ అఫ్రిది పేర్కొన్నారు. ఇన్నింగ్స్ మొదటి నుంచి చివరి వరకు వికెట్లు కాపాడుకుంటూ ఆడటంపై దృష్టిపెట్టాలని ఆయన సూచించారు. తొలి ఆరు వికెట్లు కనీసం 15 లేదా 16 ఓవర్ల వరకు క్రీజులో ఉండేలా చూసుకోవాలని.. ఒకవేళ అలా జరిగితే చివరి 4 ఓవర్లలో పవర్ హిట్టర్లు ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడి భారీ స్కోరు సాధించగలరని అఫ్రిది తన వ్యూహాన్ని వివరించారు.
ఓపెనర్లకు కీలక సందేశం
మ్యాచ్ ఫలితాన్ని శాసించే ఇన్నింగ్స్ ఆరంభంలో ఓపెనర్లు పోషించాల్సిన పాత్రపై అఫ్రిది స్పష్టత ఇచ్చారు. స్కోరు బోర్డును పరిగెత్తించడం ఎంత ముఖ్యమో.. అనవసరమైన షాట్లకు పోకుండా వికెట్లను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని ఆయన హెచ్చరించారు. దూకుడు, జాగ్రత్తల మధ్య సమతుల్యత పాటిస్తూ ఆడితేనే భారత్ వంటి బలమైన బౌలింగ్ లైనప్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని షాహిద్ అఫ్రిది మార్గనిర్దేశం చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications