టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా జరగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు మైండ్ గేమ్స్ మొదలయ్యాయి. పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా, టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు ఓ ఆసక్తికరమైన సవాల్ విసిరారు. టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ గత నమీబియా మ్యాచ్‌కు ముందు కడుపులో నొప్పి కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. అయితే పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా మాత్రం అభిషేక్ కోలుకోవాలని, అతను భారత్ తుది జట్టులో ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించాడు. "అభిషేక్ శర్మ రేపటి మ్యాచ్ ఆడాలని నేను కోరుకుంటున్నాను. అతను త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. మేము అత్యుత్తమ ఆటగాళ్లతోనే పోటీ పడాలనుకుంటున్నాము" అని పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా మీడియా సమావేశంలో పేర్కొన్నాడు.
హ్యాండ్‌షేక్ వివాదం: క్రీడా స్ఫూర్తి ఏది?
గత ఆసియా కప్‌లో పహల్గాం దాడికి నిరసనగా భారత జట్టు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఇది అప్పట్లో పెద్ద వివాదానికి దారితీసింది. దీనిపై స్పందిస్తూ సల్మాన్ ఆఘా.. "రేపటి మ్యాచ్‌లో క్రీడా స్ఫూర్తి కనిపిస్తుందని ఆశిస్తున్నాను" అని వ్యాఖ్యానించాడు. అయితే మరి పాక్ జట్టు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందా? అని అడగ్గా.. "అది రేపు తెలుస్తుంది" అంటూ దాటవేశాడు.

మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్‌పై చర్చ
పాక్ బౌలర్ ఉస్మాన్ తారిఖ్ విభిన్నమైన బౌలింగ్ యాక్షన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అతని బౌలింగ్ యాక్షన్ అక్రమమని వార్తలు వస్తున్న నేపథ్యంలో పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా అతనికి మద్దతుగా నిలిచాడు. "అతని యాక్షన్ ఇప్పటికే రెండుసార్లు క్లియర్ అయ్యింది. మీడియా అనవసరంగా హైప్ చేస్తోంది. యాక్షన్ క్లియర్ అయినప్పుడు ఇక చర్చ ఎందుకు?" అని సల్మాన్ ప్రశ్నించాడు. ఉస్మాన్ తారిఖ్ తన వింత యాక్షన్‌తో భారత బ్యాటర్లను ఇబ్బంది పెడతాడని భావిస్తున్నారు.