Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Pakistan T20 World Cup 2021: నెట్స్‌లో చెమటోడ్చిన కింగ్ కోహ్లీ: క్రీజ్‌లో ఏ మాయ చేస్తాడో?

India vs Pakistan T20 World Cup 2021: Captain Virat Kohli breaking sweat in the nets ahead of the match

అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఆరంభమైన టీ20 ప్రపంచ కప్ 2021 టోర్నమెంట్‌లో భాగంగా భారత్-పాకిస్తాన్ జట్లు పోరాడనున్నాయి. సూపర్ 12 ఆరంభమైన రెండో రోజే ఈ రెండు జట్లు ఎదురు పడ్డాయి. పైగా ఈ టోర్నమెంట్‌లో భారత్-పాకిస్తాన్ జట్లకు ఇదే తొలి మ్యాచ్ కూడా. మొత్తంగా ఇది మూడోది. టీమ్-1లో ఇంగ్లాండ్-వెస్టిండీస్, దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య మ్యాచులు శనివారం ముగిశాయి. వాటిల్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు.. తమ ప్రత్యర్థులపై ఘన విజయాన్ని సాధించాయి.. బోణీ కొట్టాయి.

బోణీ కొట్టిన ఇంగ్లాండ్, ఆసీస్

పాయింట్ల పట్టికలో ఇంగ్లాండ్ అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ అయిదు, ఆరు స్థానాల్లో సెటిల్ అయ్యాయి. టీమ్-2లో ఉన్న భారత్-పాకిస్తాన్ మధ్య ఈ సాయంత్రం 7:30 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మ్యాచ్ మొదలు కానుంది. తన చిరకాల ప్రత్యర్థిని ఎదుర్కొనబోతోన్నందున టీమిండియాపై ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. వరల్డ్ కప్‌లో గానీ, టీ20 ప్రపంచకప్‌లో గానీ పాకిస్తాన్‌పై ఓడిన చరిత్ర భారత్‌కు లేదు ఇప్పటిదాకా.

గెలవాలనే పట్టుదల..

అదే ఘన చరిత్రను, ఆనవాయితీని ముందుకు తీసుకెళ్లాలనే పట్టుదల టీమిండియా ప్లేయర్లలో ప్రస్ఫూటంగా కనిపిస్తోంది. అందుకే- జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించింది.. చెమటోడ్చింది. అక్కడితో ఆగలేదు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు.. ఆప్షనల్ ట్రైనింగ్ సెషన‌ను కూడా ఏర్పాటు చేసింది. ఈ సెషన్స్‌లో- కేప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కేప్టెన్ రోహిత్ శర్మ, ఓపెనర్ కేఎల్ రాహుల్, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్స్ రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, మరో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పాల్గొన్నారు. పొద్దు పోయేంత వరకూ శ్రమించారు.

నెట్స్‌లో చెమటోడ్చిన విరాట్..

నెట్స్‌లో విరాట్ కోహ్లీ చెమటోడ్చడం కనిపించింది. మిగిలిన జట్టు ప్లేయర్లతో పోల్చుకుంటే.. విరాట్ కోహ్లీ ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్స్- సుదీర్ఘంగా కొనసాగింది. క్రీజ్‌లో చాలాసేపు బ్యాటింగ్ చేస్తూ కనిపించాడతను. క్యాచ్, ఫీల్డింగ్ చేస్తూ చెమటోడ్చాడు. మెంటార్‌గా కొత్తగా అపాయింట్ అయిన టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గైడెన్స్‌లో అతని ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్స్ సాగింది. మధ్యమధ్యలో జట్టు ప్లేయర్లతో ముచ్చటిస్తూ, వారికి సూచనలు ఇస్తూ కనిపించాడు.

కోహ్లీ కుదురుకోవడం

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఇలాంటి మేజర్ టోర్నమెంట్లల్లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోని రికార్డ్ ఉన్నందున.. దాన్ని కొనసాగించాలనే పట్టుదల కోహ్లీలో కనిపించింద. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్‌గా క్రీజ్‌లోకి దిగే విరాట్ కోహ్లీ.. బ్యాటింగ్ శైలి కూడా జట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. బ్యాటింగ్‌లో అతను దూకుడును ప్రదర్శిస్తే- మిడిల్ ఆర్డర్ మాత్రమే కాదు- లోయర్ ఆర్డర్ బ్యాటర్స్ కూడా స్వేచ్ఛగా భారీ షాట్లను ఆడతారు. అదే కోహ్లీ విఫలమైతే.. ఆ ఒత్తిడి అనేది తరువాత వచ్చే బ్యాటర్లపై పడుతుంది.

కోహ్లీపై ఒత్తిడి..

వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని విరాట్ కోహ్లీ- ఈ ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్స్‌లో తీవ్రంగా శ్రమించాడు. పైగా కేప్టెన్సీ బాధ్యతను మోస్తున్నాడు. పాకిస్తాన్‌తో ఓడిపోని చరిత్రను కొనసాగించి తీరాల్సిన ఒత్తిడి అతని మీదే అధికంగా ఉంటుంది. టీ20 ప్రపంచకప్, వరల్డ్ కప్‌లల్లో టైగా ముగిసిన మ్యాచ్‌ను మినహాయిస్తే.. భారత్‌ ఏనాడూ పాకిస్తాన్ చేతిలో ఓడిపోలేదు. అలాంటిది ఈ మ్యాచ్ గనక చేజార్చుకుంటే.. ఓ ఘన చరిత్రకు తెర దించినట్టవుతుందనే ఒత్తిడిని కోహ్లీ ఎదుర్కొంటున్నాడు. అది రిపీట్ కాకుండా ఉండటానికి తనవంతు శ్రమించాడు.

Story first published: Sunday, October 24, 2021, 8:38 [IST]
Other articles published on Oct 24, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+