For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రికార్డులతో చెలరేగిపోతున్న రోహిత్.. ధావన్‌ల భాగస్వామ్యం

Asia Cup 2018 : Ind vs Pak : Rohit Sharma, Shikhar Dhawan's Patnership Creates Record | Oneindia
 India vs Pakistan: Records tumble after Rohit Sharma and Shikhar Dhawan’s stunning partnership

దుబాయి: టీమిండియా వన్డే ఓపెనింగ్‌ జోడి రోహిత్‌ శర్మ-శిఖర్‌ ధావన్‌లు ఇప్పటికే పలు రికార్డులను సృష్టించారు. ఆసియాకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో ఆదివారం జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌లో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంలో రోహిత్‌(111 నాటౌట్‌)-ధావన్‌(114)ల జంట తొలి వికెట్‌కు 210 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి మరో రికార్డును పెంచారు.

 2009లో న్యూజిలాండ్‌పై గంభీర్‌-సెహ్వాగ్‌

2009లో న్యూజిలాండ్‌పై గంభీర్‌-సెహ్వాగ్‌

ఫలితంగా ఛేజింగ్‌లో తొలి వికెట్‌కు అత్యధిక భాగస‍్వామ‍్యాన్ని సాధించిన భారత జోడిగా రికార్డులకెక్కింది. ఈ క్రమంలోనే 2009లో హామిల్టన్‌లో న్యూజిలాండ్‌పై గంభీర్‌-సెహ్వాగ్‌ జోడి సాధించిన 209 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యాన్ని అధిగమించారు. మరొకవైపు వన్డేల్లో తొలి వికెట్‌కు ఎక్కువసార్లు 100 కంటే ఎక్కువ పరుగులు సాధించిన రెండో భారత్‌ జోడిగా రోహిత్‌-ధావన్‌ల జోడి నిలిచింది.

జోడీలుగా రికార్డులతో ఇండియన్ ఓపెనర్లు

జోడీలుగా రికార్డులతో ఇండియన్ ఓపెనర్లు

సచిన్‌-గంగూలీ(21సార్లు) తొలి స్థానంలో ఉండగా, రోహిత్‌-ధావన్‌ల జోడి(13సార్లు) రెండో స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా తొలి వికెట్‌కు ఎక్కువసార్లు 100కంటే ఎక్కువ పరుగులు నమోదు చేసిన నాలుగో జోడీగా రోహిత్‌-ధావన్‌లు గుర్తింపు పొందారు. అదే సమయంలో పాకిస్తాన్‌పై ఒకే మ్యాచ్‌లో ఇద్దరు భారత బ్యాట్స్‌మెన్‌ సెంచరీలు చేయడం ఇది మూడోసారి.

భారత ఓపెనర్ల సెంచరీలు ఏడోసారి:

భారత ఓపెనర్ల సెంచరీలు ఏడోసారి:

2006 షార్జాలో సచిన్‌ (118), సిద్ధూ (101); 2005లో కొచ్చిలో సెహ్వాగ్‌ (108), ద్రవిడ్‌ (104) ఈ ఘనత సాధించారు. ఒకే మ్యాచ్‌లో ఇద్దరు భారత ఓపెనర్లు సెంచరీలు చేయడం ఇది ఏడోసారి. గతంలో సచిన్‌-గంగూలీ మూడుసార్లు (1998లో శ్రీలంకపై; 2001లో దక్షిణాఫ్రికాపై; 2001లో కెన్యాపై), సెహ్వాగ్‌-గంగూలీ (2002లో ఇంగ్లండ్‌పై), సెహ్వాగ్‌-సచిన్‌ టెండూల్కర్‌ (2003లో న్యూజిలాండ్‌పై), రహానే-ధావన్‌ (2014లో శ్రీలంకపై) ఒక్కోసారి ఇలా చేశారు.

7000 పరుగులు పూర్తి చేసుకున్న 7వ బ్యాట్స్‌మన్‌

7000 పరుగులు పూర్తి చేసుకున్న 7వ బ్యాట్స్‌మన్‌

వన్డేల్లో 7 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఏడో భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ శర్మ రికార్డుల కెక్కాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే(181) ఏడు వేల పరుగులు పూర్తి చేసుకున్న ఐదో బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ శర్మ రికార్డు సాధించాడు. ఈ జాబితాలో హషీమ్‌ ఆమ్లా(150 ఇన్నింగ్స్‌ల్లో), విరాట్‌ కోహ్లి(161), ఏబీ డివిలియర్స్‌ (166), సౌరవ్‌ గంగూలీ (174) తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు.

Story first published: Monday, September 24, 2018, 19:02 [IST]
Other articles published on Sep 24, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+