IND vs PAK: భారత్, పాక్ మ్యాచ్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో అందరికి తెలిసిందే. ఈ రెండు దేశాలు అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడితే దానిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ భారీ ఆదాయం లభిస్తుంది. వాస్తవానికి చెప్పాలంటే.. ఐసీసీ సిరీస్ మొత్తం భారత్ -పాకిస్థాన్ మ్యాచ్ ఆధారంగా రూపొందించబడింది. అందుకే ఐసీసీ ఎప్పుడూ భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్ లో ఉండేలా షెడ్యూల్ ను రూపొందిస్తుంది. ఎందుకంటే దాదాపు 300 మిలియన్ల మంది ప్రేక్షకులు ఈ మ్యాచ్ ను చూస్తారు. దీని వల్ల పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది.
India vs Pakistan Live స్కోరు కార్డు
భారత్, పాకిస్థాన్ లు చివరిసారిగా 2023 ప్రపంచకప్ లో తలపడ్డాయి. ఇందులో ఒక్క టెలివిజన్ లోనే 173 మిలియన్ల మంది ఆ మ్యాచ్ ను తిలకించారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్ ద్వారా 225 మిలియన్ల మంది వీక్షించారు. దీంతో ఆ మ్యాచ్ అత్యధికంగా వీక్షించబడిన వన్డే మ్యాచ్ గా నిలిచింది. ఈ 50వ ప్రపంచ కప్ మ్యాచ్ కోసం స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రకటనల రుసుముగా పది సెకన్లకు రూ.30 లక్షలను వసూలు చేసింది. ఈ విషయంలో స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ కోసం ప్రకటనల రుసుముగా 10 సెకన్లకు రూ.50 లక్షలు వసూలు చేస్తోంది. 10 సెకన్ల ప్రకటన పొందడానికి వివిధ కంపెనీలు పోటీ పడుతున్నాయి.

మ్యాచ్ మొత్తం 100 ఓవర్లలో ప్రతి ఓవర్, ప్రతి వికెట్ పతనం మధ్య యాడ్స్ ఉంటాయి. అదే నిజమైతే.. ప్రతి 10 సెకన్లకు రూ.50 లక్షలు ఖర్చయితే మొత్తం ప్రకటనల ద్వారా ఎంత ఆదాయం వస్తుందో మీరే లెక్కించాలి. గత 20 ఏళ్లలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ల ద్వారానే రూ.10 వేల కోట్ల ఆదాయం వచ్చిందని ఫిక్కీ(FICCI) తెలిపింది.