IND VS PAK: రిషబ్ పంత్ సిక్స్‌లు.. స్టేడియంలో బాలీవుడ్ హీరోయిన్ రచ్చ! ఆమెకు మళ్లీ దగ్గరవుతున్నాడా?

హైదరాబాద్: టీమిండియా క్రికెటర్లు, బాలీవుడ్ హీరోయిన్‌ల మధ్య ప్రేమాయణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెటర్లు, హీరోయిన్ల మధ్య ప్రేమయణం అంటే రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఈ రూమర్స్‌ను కొందరు నిజం చేసారు కూడా. విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ, జహీర్ ఖాన్-సాగరిక, హర్భజన్ సింగ్-గీతా బస్రా, యువరాజ్ సింగ్-హజెల్ కీచ్, హార్దిక్ పాండ్యా-నటాషా కొద్దికాలం ప్రేమలో ఉండి తర్వాత వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం యువ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌ల హవా నడుస్తోంది. రాహుల్ అతియా శెట్టితో ప్రేమలో ఉన్నాడు. ఇక ఇషా నేగీతో పంత్ ప్రేమాయణం సాగించాడని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మరో హీరోయిన్‌కు దగ్గరవుతున్నాడనే అనిపిస్తోంది.
సిక్స్ కొట్టినప్పుడల్లా
టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా ఆదివారం భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ మంచి ఇనింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. ఒంటి చేతి సిక్స్‌లు భారత జట్టుకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. పంత్ సిక్స్ బాదిన ప్రతిసారి ప్రేక్షకులు కేరింతలతో స్టేడియాన్ని హోరెత్తించారు. స్టేడియంలోనే ఉన్న బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా కూడా టీమిండియాను సపోర్ట్ చేసింది.
ఈ క్రమంలో పంత్ సిక్స్ కొట్టినప్పుడల్లా ఊర్వశి సంబరాలు చేసుకుంది. పంత్, ఊర్వశి డేటింగ్లో ఉన్నట్లు గతంలో పుకార్లు వచ్చిన నేపథ్యంలో మళ్లీ ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఊర్వశికి మళ్లీ పంత్ దగ్గరవుతున్నాడా అని సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి.

మైదానంలో ఊర్వశి సందడి
భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో మొదట బరిలోకి దిగిన భారత్ మొదట్లోనే కీలక వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ త్వరగానే అవుట్ అయ్యారు. అయితే విరాట్ కోహ్లీకి అండగా రిషబ్ పంత్ (30) క్రీజులోకి వచ్చాడు. ఇద్దరు పరుగులు చేస్తుండడంతో అభిమానుల్లో ఉత్సాహం నిండింది. నత్తనడకగా ఉన్న భారత స్కోర్ బోర్డ్ పంత్ రాకతో పరుగులు పెట్టింది. హసన్ అలీ బౌలింగ్‌లో ఒక్క చేత్తో వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు. దాంతో మైదానం అంతటా భారత అభిమానుల అరుపులు, కేకలతో హోరెత్తింది. బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా కూడా భారత జండా పట్టుకుని సందడి చేసింది. చీర్స్ చెబుతూ దుబాయ్ మైదానంలో అందరిని ఆకట్టుకుంది.
IND vs PAK: బౌలింగ్ చేయడు.. బ్యాటింగ్ రాదు! భారత జట్టులో అతడు ఎందుకు ఉంటున్నాడో అర్ధం కావడం లేదు!
మళ్లీ దగ్గరవుతుందా
రిషబ్ పంత్, ఊర్వశి రౌతేలా గతంలో పార్టీలకు కలిసిన వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు, వార్తలు సైతం బయటకు వచ్చాయి. ఏమైందో ఏమో తెలియదు కానీ ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఆ సమయంలో పంత్‌తో టచ్‌లోకి వచ్చేందుకు ఊర్వశి చాలా ప్రయత్నాలు చేసిందని సమాచారం. చివరకు భారత వికెట్ కీపర్ ఆమె నంబర్‌ను వాట్సాప్‌లో బ్లాక్ చేశాడు కూడా. ఆపై టీవీ నటి ఇషా నేగితో ప్యాంటు డేటింగ్ మొదలెట్టాడు. ఇప్పుడు అనుకోకుండా ఊర్వశి మైదానంలో ప్రత్యక్షం అవ్వడంతో.. పంత్ కు ఊర్వశి మళ్లీ దగ్గరవుతుందా అని సోషల్ మీడియా కోడై కూస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications