2007 మేజిక్ రిపీట్?: భారత్-పాకిస్తాన్ మధ్య మళ్లీ ఫైనల్ పోరు చూడగలుగుతామా?

మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్ 2022 సూపర్ 12లో భారత క్రికెట్ జట్టు ఇవ్వాళ తన చిట్టచివరి మ్యాచ్ ఆడుతోంది. జింబాబ్వేతో తలపడుతోంది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌లో కొద్దిసేపటి కిందటే మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ దిగింది. ఆరు ఓవర్లల్లో వికెట్ నష్ట పోకుండా 50 పరుగులు చేసింది. కేప్టెన్ రోహిత్ శర్మ మరోసారి నిరాశ పరిచాడు. భారీ స్కోర్ చేయకుండానే వెనుదిరిగాడు. 15 పరుగులు చేసి ముజరబని బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

రాహుల్ దూకుడు..
మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ తన దూకుడును కొనసాగించారు. ఈ మ్యాచ్‌లో కూడా అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కిందటి మ్యాచ్‌లోనూ అతను హాఫ్ సెంచరీ చేశాడు. ఇప్పుడు కూడా తన కోటా హాఫ్ సెంచరీని ముగించాడు. 51 పరుగులు చేసి సికందర్ రజా బౌలింగ్‌లో మసకద్జాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ టోర్నమెంట్‌లో అతనికి ఇది వరుసగా రెండో అర్ధసెంచరీ. తొలి మూడు మ్యాచ్‌లల్లో విఫలమైన తరువాత మళ్లీ పట్టాలెక్కాడు రాహుల్. విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ నిరాశ పరిచారు.

అనూహ్యంగా సెమీస్‌కు..
కాగా- అనూహ్య పరిణామాల మధ్య పాకిస్తాన్ సెమీ ఫైనల్స్ చేరుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా- చివరి సూపర్ 12 మ్యాచ్‌లో నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోవడం వల్ల సమీకరణాలన్నీ ఒక్కసారిగా తారుమారయ్యాయి. సెమీ ఫైనల్స్‌కు చేరాల్సిన దక్షిణాఫ్రికా ఈ ఓటమితో ఇంటిదారి పట్టింది. అదే సమయంలో పెట్టే బేడా సర్దు కోవాల్సిన పాకిస్తాన్.. సెమీ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. తన చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించింది.

2007 తరువాత..
టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భారత్, పాకిస్తాన్ సెమీ ఫైనల్స్‌లో అడుగు పెట్టడం ఇదే తొలిసారి. 2007 తరువాత మళ్లీ ఈ రెండు జట్లు సెమీస్ చేరాయి. ఇదివరకు ఈ రెండు జట్లు వేర్వేరుగా సెమీస్ చేరాయి గానీ- ఒకేసారి అందులో ఎంట్రీ ఇవ్వడం మాత్రం ఇదే తొలిసారి కావడం ఆసక్తి రేపుతోంది. సెమీ ఫైనల్స్‌లో గనక ఈ రెండు జట్లు తమ ప్రత్యర్థులను ఓడించి- ఫైనల్స్ చేరే అవకాశాలకు తెర తీసినట్టయింది ఈ ఈక్వేషన్స్.

నాడు ఛాంపియన్‌గా..
2007లో తొలిసారిగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌ను ప్రవేశపెట్టగా.. అదే ఏడాది భారత్-పాకిస్తాన్ ఫైనల్స్‌లో హోరాహోరీగా పోరాడాయి. నాలుగు పరుగుల తేడాతో పాకిస్తాన్.. టీమిండియా చేతిలో చిత్తయింది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని టీమిండియా ఛాంపియన్‌గా ఆవిర్భవించగా- పాకిస్తాన్ రన్నరప్‌తో సరి పెట్టుకుంది. ఇప్పుడు మళ్లీ ఈ రెండు జట్లు అదే టీ20 ప్రపంచకప్‌లో పోరాడే అవకాశాన్ని దక్కించుకున్నాయి. 2007 నాటి రిజల్ట్ ఇప్పుడు మళ్లీ రిపీట్ అవుతుందా? లేదా? అనేది చర్చనీయాంశమౌతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications