1993లో వార్న్, 2019లో కుల్దీప్: 'బాల్ ఆఫ్ సెంచరీ'ని గుర్తు చేశాడు

హైదరాబాద్: కొన్ని మ్యాచ్‌లు... కొన్ని బంతులు అలా చరిత్రలో మిగిలిపోతాయి. క్రికెట్‌పై కనీసం పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికీ 'బాల్ ఆఫ్ ద సెంచరీ' గురించి తెలిసే ఉంటుంది. ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ 1993లో ఈ మ్యాజిక్ చేశాడు. యాషెస్ టెస్టు సిరిస్‌లో భాగంగా మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన టెస్టులో ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మన్ మైక్ గ్యాటింగ్‌ను బోల్తా కొట్టించిన బంతి అది. లెగ్ స్టంప్ బయట పిచ్ అయిన బాల్.. మెలికలు తిరుగుతూ ఏకంగా ఆఫ్‌స్టంప్‌ను గిరాటేసింది. ఏం జరిగిందో అర్థం కాని గ్యాటింగ్‌తోపాటు అంపైర్ కూడా అలా చూస్తుండిపోయారు. ఆసీస్ ప్లేయర్స్ మాత్రం సంబరాల్లో మునిగితేలారు. దీనిని 'బాల్ ఆఫ్ ద సెంచరీ'గా ఆ తర్వాత ఐసీసీ గుర్తించింది.

1993లో షేన్ వార్న్
ఈ బంతి గురించి క్రికెట్ అభిమానులు, పండితులు, విశ్లేషకులు ఇప్పటికీ గుర్తు చేసుకొంటూనే ఉంటారు. 1993లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో వార్న్ లేగ్ బ్రేక్ పిచ్ మీద పడిన వెంటనే అనూహ్యంగా 14 డిగ్రీల మేర బొంగరంలా గింగరాలు తిరిగి మరీ గాటింగ్ ఆఫ్ స్టంప్ బెయిల్‌ను గిరాటేసింది. క్రికెట్ చరిత్రలోనే వార్న్ సంధించిన ఆ బంతి అసాధారణ బంతిగా నిలిచిపోయింది.

2019లో కుల్దీప్ యాదవ్
వార్న్ బాల్ ఆఫ్ ది సెంచరీ ఘటనను కుల్దీప్ యాదవ్ ఈ ప్రపంచకప్‌లో గుర్తు చేశాడు. వార్న్ రికార్డు సృష్టించిన ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియంలోనే గత ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మాయ చేశాడు. 24వ ఓవర్లో అద్భుతమైన బంతితో బాబర్ అజామ్‌ను బౌల్డ్ చేసి మ్యాచ్‌నే మలుపు తిప్పాడు.
ఆ బంతి గురించి ఎంత చెప్పినా తక్కువే
ఈ బంతి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆఫ్‌స్టంప్ మీదుగా పడిన బంతి అనూహ్యంగా టర్న్ తీసుకొని లోపలికి దూసుకొచ్చింది. బయటి వైపు ఆడేందుకు ప్రయత్నించిన బాబర్ పూర్తిగా అంచనా తప్పా డు. దీంతో బ్యాట్, ప్యాడ్ మధ్య నుంచి దూసుకుపోయిన బంతి బెయిల్స్‌ను ఎగరగొట్టింది. అజామ్ తన కళ్లను తానే నమ్మలేకపోయాడు.

5.80 డిగ్రీల కోణంలో మెలికలు తిరిగి
గంటకు 72 కిలోమీటర్ల వేగంతో కుల్దీప్ సంధించిన ఈ బంతి 5.80 డిగ్రీల కోణంలో మెలికలు తిరిగి మరీ వికెట్‌ను గిరాటేసింది. ఈ బంతిపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం ప్రశంసల వర్షం కురిపించాడు. బాబర్ అజామ్‌ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేసిన బంతి అత్యుద్భుతమని విరాట్ కోహ్లీ కొనియాడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications