Asia Cup 2022 : ఇండియా వర్సెస్ పాకిస్థాన్ హెడ్ టు హెడ్ రికార్డులు.. టాప్ 4 ఆసియా కప్ మ్యాచ్‌లు

భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య ఆసియా కప్ 2022 టోర్నీ వేదికగా రసవత్తర పోరుకు రంగం సిద్ధమవుతుంది. ఆగస్టు 28న దుబాయ్ స్టేడియం క్రికెట్ సమరానికి రంగస్థలం కాబోతుంది. బ్యాట్లే ఆయుధాలు.. బంతులే ఫిరంగులుగా సాగే సమరమిది. నువ్వానేనా అన్నట్లు కొదమ సింగాల్లా తలపడే ప్లేయర్లే వారియర్లు. క్షణ క్షణం చేతులు మారే విజయం.. స్టేడియంలో భావోద్వేగాల మధ్య ప్రేక్షక లోకం అరుపులు.. వెరసి ఓ భీకర క్రికెట్ కాండకు తరుణమొచ్చింది. కేవలం ఆసియాకప్, ఐసీసీ లాంటి టోర్నీల్లోనే ప్రస్తుతం పాక్ వర్సెస్ ఇండియా తలపడుతున్నాయి. రెండు జట్లు మంచి ఫాంలో ఉండడంతో ఓ హోరాహోరీ పోరు ఖాయంగా కన్పిస్తుంది.

ఆసియాకప్‌లో భారత్‌దే హవా
ఇకపోతే 1984 నుంచి ఆసియా కప్ జరుగుతుంది. ఇప్పటివరకు ఆసియాకప్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ నడుమ 14మ్యాచ్‌లు ఈ టోర్నీలో జరిగాయి. భారత్ 8మ్యాచ్‌ల్లో గెలుపొందగా, పాకిస్థాన్ 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 1997లో జరిగిన మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. ఆసియా కప్ 15వ ఎడిషన్ ఆగస్ట్ 27 నుంచి సెప్టెంబర్ 11మధ్య జరుగుతుంది. ఆగస్టు 28న పాక్‌తో ఇండియా 15వ మ్యాచ్‌లో తలపడనుంది.

మొత్తం టీ20ల్లో పాక్ గెలిచింది రెండే..!
ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు తలపడనున్నాయి. భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ అయిదు ఇప్పటికే అర్హత సాధించిన జట్లు కాగా.. హాంకాంగ్, కువైట్, సింగపూర్, UAE జట్లలో ఒక జట్టు క్వాలిఫయర్‌గా టోర్నీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈసారి టీ20 ఫార్మాట్లో ఈ టోర్నీ జరుగుతుంది. ఇక పాకిస్థాన్ వర్సెస్ ఇండియా మధ్య ఇప్పటివరకు 9 టీ20 మ్యాచ్‌లు జరగ్గా అందులో భారత్ 7 మ్యాచ్‌లు గెలవగా.. పాక్ 2 మ్యాచ్‌లే గెలిచింది. తద్వారా భారత్ ఆధిక్యంలో ఉంది. ఇక ఆసియా కప్ టోర్నీలో పాక్ వర్సెస్ భారత్ మధ్య టాప్ 4 మ్యాచ్‌లను ఓసారి రివైండ్ చేసుకుంటే..?

2018: బౌలింగ్లో భువీ, జాదవ్.. బ్యాటింగ్లో రోహిత్, ధావన్
2018లో దుబాయ్‌లో జరిగిన గ్రూప్ A పోరులో రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు పాకిస్థాన్‌పై 8వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో కేదార్ జాదవ్, భువనేశ్వర్ కుమార్ చెరో మూడు వికెట్లు తీసి సత్తా చాటారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 162 పరుగులు చేయగా.. రోహిత్ శర్మ 52, శిఖర్ ధావన్ 46పరుగులు చేసి ఈజీగా గెలిపించారు.

2016 : సునాయసంగా గెలుపు
2016లో 5 వికెట్ల తేడాతో 27బంతులు మిగిలి ఉండగానే పాక్‌పై భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ కేవలం 83పరుగులే చేసింది. తర్వాత భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, అజింక్యా రహానె తొందరగా అవుటైనా.. విరాట్ కోహ్లీ 51 బంతుల్లో 49పరుగులు చేసి భారత్‌కు విజయ లాంఛనాన్ని అందించాడు. మిర్పూర్‌లో ఈ మ్యాచ్ జరిగింది. 2016లో ఆసియా కప్ టోర్నీ టీ20 ఫార్మాట్లో జరిగింది.

2012: పాక్ తుక్కు రేగ్గొట్టిన కోహ్లీ
బంగ్లాదేశ్ వేదికగా జరిగిన ఆసియాకప్ టోర్నీలో భారత్ 6వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. విరాట్ కోహ్లి 148బంతుల్లో చేసిన 183పరుగులు చేసి అద్భుత ఛేజింగ్ విజయాన్ని అందించాడు. ఇక విరాట్ కెరీర్లో వన్డేల్లో ఇదే అత్యుత్తమ స్కోరు. పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసి 328పరుగుల భారీ టార్గెట్ భారత్ ముందుంచింది. ఇక 329పరుగుల ఛేదనలో కోహ్లీ అనితర సాధ్యమైన ఆటతో పాక్‌కు చుక్కలు చూపించాడు. అతని ఇన్నింగ్స్‌లో 22ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో భారత్ మరో 13 బంతులు మిగిలి ఉండగానే గెలుపు రేఖ దాటింది.

2010: అక్తర్ వర్సెస్ హర్భజన్
2010లో ఆసియా కప్ మ్యాచ్ హర్భజన్ సింగ్, షోయబ్ అక్తర్ మధ్య లొల్లికి పెట్టింది పేరు. హర్భజన్ మహ్మద్ అమీర్ బౌలింగ్లో సిక్సర్ కొట్టగా.. ఆ తర్వాత అక్తర్, హర్భజన్ మధ్య పరస్పర వాగ్వాదం జరిగింది. చివరికి ఈ మ్యాచ్‌లో భారత్ ఉత్కంఠభరితమైన విజయాన్ని అందుకుంది. తొలుత పాక్ బ్యాటర్ సల్మాన్ బట్ 74 పరుగులతో రాణించడంతో 267పరుగులు చేసింది. తర్వాత ఛేదనలో గౌతం గంభీర్ 83, ఎంఎస్ ధోనీ 56పరుగులు చేయడంతో భారత్ 3వికెట్ల తేడాతో గెలుపొందింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications