న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌లో భారత్ vs పాక్ మ్యాచ్: మాంచెస్టర్‌లో గేమ్ ఛేంజర్లు వీళ్లే!

India vs Pakistan: Game changers who can impact match at Manchester

హైదరాబాద్: ప్రపంచకప్‌లో టీమిండియా తన తదుపరి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో తలపడనుంది. మాంచెస్టర్ వేదికగా జూన్ 16(ఆదివారం) ఈ మ్యాచ్ జరగనుంది. ఇండియా-కివీస్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ప్రస్తుతం అందరి దృష్టి టోర్నీకే హైలెట్‌గా నిలిచే ఈ మ్యాచ్‌పై పడింది. భారత్-పాక్ మ్యాచ్ అంటే ఆ క్రేజే వేరు.

సీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ మ్యాచ్ కోసం భారత్, పాక్ అభిమానులే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు సైతం ఆసక్తిని కనబరుస్తారు. కాగా, టోర్నీలో టీమిండియా రెండు వరుస విజయాలు సాధించగా గురువారం న్యూజిలాండ్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఏడు పాయింట్లతో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉండగా... ఐదు పాయింట్లతో భారత్‌ మూడోస్థానంలో కొనసాగుతోంది.

ప్రపంచకప్‌లో భారత్‌ Vs పాక్‌..: ఆరుసార్లు భారతే విజేతప్రపంచకప్‌లో భారత్‌ Vs పాక్‌..: ఆరుసార్లు భారతే విజేత

ఇక, పాక్‌ నాలుగు మ్యాచ్‌లకు గాను రెండింట ఓడి, పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే 1992 నుండి 2015 ప్రపంచకప్‌ వరకు భారత్‌, పాక్‌లు ఆరుసార్లు తలపడగా.. ఆరుసార్లు భారతే విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో గేమ్ ఛేంజర్స్‌ను పరిశీలిస్తే...

విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ

కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇది చాలా పెద్ద మ్యాచ్. ఎందుకంటే కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఆడుతోన్న తొలి ప్రపంచకప్ ఇది. గత కెప్టెన్లు అందరూ ప్రపంచకప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో కోహ్లీ కూడా ఈ మ్యాచ్‌లో పాక్‌పై నెగ్గాలనే గట్టి పట్టుదలతో ఉన్నాడు. సాధారణంగా భారత్-పాక్ మ్యాచ్ అంటే కొంత ఒత్తిడి ఉంటుంది. అయితే, ఈ ఒత్తిడిని ఎలా జయించాలో తమకు తెలుసని కోహ్లీ అన్నాడు.

జస్ప్రీత్ బుమ్రా

జస్ప్రీత్ బుమ్రా

ఈ వరల్డ్‌కప్‌లో భారత పేస్ బౌలింగ్ దళానికి నాయకత్వం వహిస్తున్నాడు. టీమిండియా ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టాడు. పరిమిత ఓవర్లలో ప్రస్తుతం బుమ్రా అత్యత్తుమ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. అయితే, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ పైనల్లో బుమ్రా ఎదురైన చేదు అనుభవాన్ని ఈ మ్యాచ్‌లో అధిగమించాలని చూస్తున్నాడు.

యజువేంద్ర చాహల్

యజువేంద్ర చాహల్

మిడిల్ ఓవర్లలో ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మన్‌కు ఈ చైనామన్ స్పిన్నర్ చుక్కులు చూపించగలడు. ఈ వరల్డ్‌కప్‌లో టీమిండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా చాహల్ కొనసాగుతున్నాడు. కోహ్లీసేన ఆడిన రెండు మ్యాచ్‌ల్లో చాహల్ ఆరు వికెట్లు పడగొట్టాడు. అయితే, స్పిన్‌ను సమర్ధవంతగా ఎదుర్కొనే పాక్ బ్యాట్స్‌మెన్‌కు చాహల్ ఎలాంటి బంతులు విసురుతాడో చూడాలి మరి.

మహ్మద్ ఆమీర్

మహ్మద్ ఆమీర్

ఆస్ట్రేలియాతో జరిగిన గత మ్యాచ్‌లో మహ్మద్ ఆమీర్ ప్రపంచ రికార్డుని నెలకొల్పాడు. ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై ఐదు వికెట్లు తీసిన మొట్టమొదటి పాక్ బౌలర్. గతంలో భారత బ్యాట్స్‌మెన్‌పై విజయవంతమైన బౌలర్‌గా మహ్మద్ ఆమీర్‌కు పేరుంది. అమీర్ రూపంలో గండం ఎదురు కావ‌చ్చ‌ు. అత‌ణ్ని అడ్డుకోవ‌డానికి ప్ర‌త్యేకంగా వ్యూహాల‌ను ర‌చించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

మహ్మద్ హఫీజ్

మహ్మద్ హఫీజ్

భారత్‌తో మ్యాచ్ అంటే చాలు విరుచుకుపడే బ్యాట్స్ మెన్లలో పాక్ వెటరన్ ఆల్ రౌండర్ మహ్మద్ ఒకడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో పాక్ మిడిలార్డర్‌లో కీలక బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. ఆల్ రౌండర్ కావడంతో బౌలింగ్‌లో సైతం పాక్ కెప్టెన్ ఇతడి సేవలను వినియోగించుకోవచ్చు. భారత్‌తో జరిగే మ్యాచ్‌లో మహ్మద్ హఫీజ్ ఎంతో కీలకం కానున్నాడు.

ఇమామ్ ఉల్ హాక్

ఇమామ్ ఉల్ హాక్

ఇమామ్ ఉల్ హాక్ విషయానికి వస్తే ఫకార్ జమాన్, బాబర్ అజామ్ లాగా విధ్వంసకర బ్యాట్స్‌మన్ కాదు. ఓపెనర్‌గా పాక్ జట్టులో నిలకడగా ఇన్నింగ్స్ ఆడుతూ స్కోరు బోర్డుని పరిగెత్తించగలడు. ముఖ్యంగా తొలి పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా ఆడటంలో ఇమామ్ ఉల్ హాక్‌ది అందవేసిన చేయి. భారత్‌తో జరిగే మ్యాచ్‌లో ఓపెనర్‌గా కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది.

Story first published: Friday, June 14, 2019, 17:41 [IST]
Other articles published on Jun 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X