Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: ముంచేసిన దీప్తి.. పాక్‌పై భారత్ ఘన విజయం

IND vs PAK: ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్డేడియం వేదికగా జరిగిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 మెగా పోరులో భారత మహిళల జట్టు అద్భుత విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను 64 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో హర్మన్ ‌ప్రీత్ సేన ఘనంగా బోణీ కొట్టింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు తరఫున స్మృతి మంధాన హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. అనంతరం బౌలింగ్ లో దీప్తి శర్మ కెరీర్ బెస్ట్ ప్రదర్శనతో పాక్ జట్టును కుప్పకూల్చింది. ఈ విజయంతో ప్రపంచ కప్ గెలవాలనే తమ కల వైపు భారత్ బలమైన అడుగు వేసింది.

ముంచేసిన దీప్తి శర్మ.. 106 పరుగులకే ఆలౌట్
భారత్ నిర్దేశించిన 171 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. కేవలం 17 ఓవర్లలోనే 106 పరుగులకే పాక్ ఇన్నింగ్స్ కుప్పకూలింది. పాక్ ఓపెనర్ మునీబా అలీ ఒంటరి పోరాటం చేస్తూ 35 బంతుల్లో 5 ఫోర్లతో 41 పరుగులు చేసింది. మిగిలిన వారిలో అలియా రియాజ్ (18), గుల్ ఫిరోజా (12), అయేషా జాఫర్ (12) మాత్రమే రెండంకెల స్కోరు సాధించగలిగారు. భారత స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ తన అద్భుతమైన స్పిన్ మాయాజాలంతో 5 వికెట్లు పడగొట్టి పాకిస్థాన్ బ్యాటింగ్ వెన్నువిరిచింది.

India vs Pakistan Deepti Sharma 5-Wicket Haul Powers India to 64-Run Victory Over Pakistan

భారత్ కు భారీ స్కోరు అందించిన స్మృతి, రిచా ఘోష్
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. పవర్‌ప్లేలోనే ఓపెనర్ షఫాలీ వర్మ (6), జెమిమా రోడ్రిగ్స్ (1) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. స్మృతి మంధాన 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేయగా, హర్మన్‌ప్రీత్ 36 పరుగులు చేసింది. చివర్లో వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ కేవలం 17 బంతుల్లోనే 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 34 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరును అందించింది.

గణాంకాల్లో మనదే పైచేయి
ఈ విజయంతో భారత్, పాకిస్థాన్ మహిళల జట్ల మధ్య జరిగిన మొత్తం 17 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో భారత్ రికార్డు 14 విజయాలకు చేరింది. అలాగే టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇరు జట్ల మధ్య జరిగిన 9 మ్యాచ్‌ల్లో భారత్ 7 సార్లు గెలిచి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. 2020 ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన టీమిండియా, ఈసారి ఎలాగైనా కప్పును ముద్దాడాలనే పట్టుదలతో ఉంది. మొదటి మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌పై సాధించిన ఈ భారీ విజయం హర్మన్ సేనకు టోర్నీలో మున్ముందు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వనుంది.

Story first published: Sunday, June 14, 2026, 22:51 [IST]
Other articles published on Jun 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+