Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫాదర్స్ డే రోజున 'డాడీ' రో'హిట్': తొలి ఓవర్ నుంచే ఆత్మవిశ్వాసంతో!

India vs Pakistan: Daddy hundred man Rohit Sharma enacts lead act to perfection

హైదరాబాద్: రోహిత్ శర్మ... ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో రెండు సెంచరీలు నమోదు చేశాడు. తను సెంచరీలు చేసిన రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది. నిజానికి ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తన శైలికి భిన్నంగా ఆడాడు. భారత్-పాక్ మ్యాచ్ అంటే చాలు భావోద్వేగాలతో కూడుకుని ఉంటుంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఇరు దేశాల్లో అభిమానులకు ఈ మ్యాచ్ ఎంతో ప్రత్యేకం. ఇరు దేశాలకు చెందిన అభిమానులు మాత్రం ఓటమిని అసలు జీర్ణించుకోలేరు. భావోద్వేగాలు పతాక స్థాయిలో ఉంటాయి. తమ దేశం గెలవాలంటే తమ దేశం గెలవాలని కోరుకుంటారు. అలాంటి మ్యాచ్‌లో గత ఆరేళ్లుగా కలిసి ఆడుతున్న సహచర ఓపెనర్ గాయంతో మ్యాచ్‌కు దూరమయ్యాడు.

ఓపెనర్‌గా బరిలోకి దిగుతోన్న కేఎల్‌ రాహుల్‌తో కలిసి అంతకమున్నెడూ ఓపెనింగ్ ఇన్నింగ్స్ ఆడలేదు. తొలి ఓవర్‌ను ఎడమచేతి వాటం పేసర్ మహ్మద్ ఆమీర్ వేశాడు. రయ్ రయ్ మంటూ దూసుకొచ్చే బంతులు. దీంతో తొలి ఓవర్‌లో ఒక్క పరుగు కూడా చేయకపోవడంతో మెయిడిన్ అయింది. అయితే, ఒక్క పరుగు కూడా చేయలేకపోవడానికి గల కారణం రోహిత్‌కు తెలుసు.

ఎప్పట్లాగే ఆడితే

ఎప్పట్లాగే ఆడితే

తాను ఎప్పట్లాగే ఆడితే అటు రాహుల్‌తో పాటు భారత ఇన్నింగ్స్‌పైనా తన ఆట ప్రభావం చూపుతుందని అనుకున్నాడేమో. అయితే, రెండో ఓవర్ మూడో బంతిని బౌండరీకి తరలించాడు. క్రీజులో ఉన్న మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌ నుంచి సహకారం తీసుకుంటూ స్కోరు బోర్డుని పరుగులు పెట్టించాడు. ముఖ్యంగా ప్రపంచకప్‌లో ఓపెనర్‌గా తొలి మ్యాచ్ ఆడుతోన్న అతడిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు.

పాక్ బౌలర్లను సమర్ధవంతంగా

పాక్ బౌలర్లను సమర్ధవంతంగా

ఇంకేముంది.. పాక్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. వన్డేల్లో అతడికిదే వేగవంతమైన హాఫ్ సెంచరీ. ఇక, హాఫ్ సెంచరీ తర్వాత రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌లో వేగం పెరిగింది. దీంతో 85 బంతుల్లో సెంచరీ సాధించాడు. రోహిత్‌ శర్మ కెరీర్‌లో మూడో వేగవంతమైన సెంచరీ. రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ క్రికెట్ అభిమానులకు కనువిందు చేసింది.

అద్భుతమైన షాట్లతో

అద్భుతమైన షాట్లతో

అద్భుతమైన షాట్లతో స్టేడియం నలువైపులా బంతిని బాదాడు. క్రీజులో ఉన్నంతసేపు రన్‌రేట్‌ తగ్గకుండా భారీషాట్లు ఆడాడు. 123.89 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు రాబట్టాడు. ముఖ్యంగా పాక్ పేసర్ల బౌలింగ్‌లో 136.5 స్ట్రైక్‌రేట్‌తో ఆడాడు. తొలి వికెట్‌కు రాహుల్‌తో 136 పరుగులు జోడించాడు. ఇక, కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి రెండో వికెట్‌కు 98 పరుగులు జోడించాడు.

రోహిత్ శర్మ సెంచరీ

రోహిత్ శర్మ సెంచరీ

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీ నమోదు చేయడం ద్వారా అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ చరిత్రకెక్కాడు. 2015లో విరాట్ కోహ్లీ (107) తొలి సెంచరీని నమోదు చేశాడు. భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ(358 సిక్సర్లు) చరిత్ర సృష్టించాడు.

ధోని రికార్డు బద్దలు

ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(355)ని వెనక్కి నెట్టాడు. ప్రపంచకప్‌లో మొదటి మూడు మ్యాచ్‌ల్లో 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన నాలుగో భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ. 1987లో సిద్ధు, 1996లో సచిన్ టెండూల్కర్, 2011లో యువరాజ్ సింగ్ ఈ ఘనత సాధించారు. పాక్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.

ప్రతీ పరుగు ఎంతో ముఖ్యమైందే

మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ దేశం తరుపున చేసిన ప్రతీ పరుగు ఎంతో ముఖ్యమైందని, ప్రపంచకప్‌ లాంటి మ్యాచ్‌ల్లో సెంచరీ సాధిస్తే అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదని చెప్పాడు. తన కుమార్తె సమైరా తన జీవితంలోకి వచ్చాక దశ, దిశ మారిందని అంతా కలిసొస్తుందని రోహిత్‌ పేర్కొన్నాడు.

ఆమె రాకతోనే మంచి రోజులు

"ప్రస్తుతం నా జీవితంలో మంచిరోజులు నడుస్తున్నాయి. నాకు కూతురు పుట్టడం.. ఆమె రాకతోనే మంచి రోజులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం నేను క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నాను. ఈ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీపై ఆలోచించలేదు. చక్కటి ప్రారంభం మీద ఇన్నింగ్స్‌ను నిర్మించాం. జట్టుగా మేం ఆడిన తీరు పట్ల సంతోషంగా ఉన్నాం" అని అన్నాడు.

ఔటైన తీరుకు అసంతృప్తి చెందా

"అయితే, నేను ఔటైన తీరుకు అసంతృప్తి చెందా. ఆ షాట్‌ ఎంపిక నా నిర్ణయ లోపమే. నిలదొక్కుకున్నాక సాధ్యమైనన్ని పరుగులు చేయాలి. మంచి భాగస్వామ్యం నెలకొల్పాక, మ్యాచ్‌ గెలిచే సందర్భంలో ఔటవడం సరైనది కాదు. డబుల్‌ సెంచరీ గురించి నేను ఆలోచించలేదు. రాహుల్‌ చాలా బాగా ఆడాడు" అని రోహిత్ శర్మ తెలిపాడు.

Story first published: Monday, June 17, 2019, 19:45 [IST]
Other articles published on Jun 17, 2019
Read in English: Rohit Sharma's lead act
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+