IND vs PAK: భారత్ - పాక్ మధ్య క్రికెట్ అంటేనే ఓ ప్రత్యేక మజా. కానీ ఈ రెండు జట్లు గత కొన్నేళ్లుగా కేవలం ఐసీసీ నిర్వహించే బడా టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఉన్న వైరం కారణంగా ద్వైపాక్షిక సిరీస్ ఆడట్లేదు. ఈ నేపథ్యంలో భారత్ - పాక్ ఎప్పటి వరకు ద్వైపాక్షిక సిరీస్ ఆడకుండా ఉంటాయో సమాచాం తెలిసింది. దాని గురించి కథనంలోకి వెళ్లి తెలుసుకుందాం..
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఔట్..
రీసెంట్ గానే ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 23న జరిగిన మ్యాచ్ లో భారత్ - పాక్ జట్లు తలపడ్డాయి. కానీ ఈ పోరులో పాకిస్థాన్ పై భారత్ గెలిచి ముందుకు వెళ్లింది. దీంతో తాను ఆడిన రెండు మ్యాచుల్లోనూ(న్యూజిలాండ్ పై, భారత్ పై) ఓడిపోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఆతిథ్య పాకిస్థాన్ నిష్క్రమించాల్సి వచ్చింది. ఫలితంగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మరోసారి భారత్ - పాక్ మ్యాచ్ ను వీక్షించాలనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది.

ఈ క్రమంలోనే తాజాగా భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ భారత్ - పాక్ ద్వైపాక్షిక సిరీస్ గురించి మాట్లాడాడు. "సరిహద్దులో భారత్ పాక్ మధ్య శాంతి నెలకొనేంతవరకు భారత్ - పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగవు. సరిహద్దులో పాక్ చొరబాటుదారులు రావడం ఆగిపోతే అప్పుడు మేం ఆడేందుకు ఆలోచిస్తాం." అని చెప్పుకొచ్చాడు.
అదే చివరిసారిగా..
టీమిండియా చివరిసారిగా 2005-06లో పాకిస్థాన్‌లో పర్యటించింది. అనంతరం చివరిసారిగా రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ భారత్ వేదికగా 2012-13లో జరిగింది. ఇరు జట్ల మధ్య ఐపీసీ టోర్నీలు హైబ్రిడ్ మోడల్‌లోనే జరుగుతున్నాయి.