
టాస్.. కీ రోల్
ఈ మ్యాచ్‌లో టాస్ కీలక పాత్ర పోషించడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి కారణాలు లేకపోలేదు. దుబాయ్ స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఛేజింగ్ చేసే జట్టుకు అధికశాతం విజయాలను అందించింది. ఇప్పటివరకు దుబాయ్ స్టేడియంలో 74 మ్యాచ్‌లు జరగ్గా ఇందులో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచిన మ్యాచ్‌ల సంఖ్య 39. శ్రీలంక-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌లో కూడా ఇదే రుజువైంది. తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్.. శ్రీలంకను 105 పరుగులకే కట్టడి చేసింది. ఆ లక్ష్యాన్ని 10.1 ఓవర్లల్లోనే ఛేదించింది.

టీ20 ప్రపంచకప్ కూడా
2021లో జరిగిన టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ కూడా అదే చెబుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు ఓడిపోయిన మ్యాచ్‌ల సంఖ్యే ఆ టోర్నమెంట్‌లో ఎక్కువగా ఉన్నాయి. టీ20 ప్రపంచకప్ 2021లో చివరి 12 మ్యాచ్‌లల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు ఓడిపోయింది. భారత్ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. అదే టోర్నమెంట్‌లో పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతుల్లో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి ఓడిపోయిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ టోర్నీలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 151 పరుగులు చేయగా- దాన్ని పాకిస్తాన్ వికెట్ నష్టపోకుండా ఛేదించింది.

కేఎల్ రాహుల్ భయం ఎందుకు?
మొన్న ప్రెస్‌మీట్ సమయంలోనూ కేఎల్ రాహుల్ ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో టాస్ కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశాడు. పాకిస్తాన్‌పై తాము ఓడిపోయిన రెండు టీ20 మ్యాచ్‌లల్లో తొలుత బ్యాటింగ్ చేశామనే విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. టాస్ గెలిచి-బ్యాటింగ్ ఎంచుకోవడం అంటే తమను తాము ఛాలెంజ్ చేసుకున్నట్టే అవుతుందని వ్యాఖ్యానించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ చెయ్యాల్సి వస్తే.. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు.

రెండో ఇన్నింగ్‌లో బ్యాటింగ్ సులువు..
దుబాయ్ స్టేడియంలో రెండో ఇన్నింగ్‌లో బ్యాటింగ్ చేయడం సులువు. సమయం గడుస్తున్న కొద్దీ గాలిలో తేమశాతం పెరుగుతుంటుంది. మంచు బిందువులు ఏర్పడుతుంటాయి. ఇది బౌలర్లకు ఇబ్బంది కలిగిస్తుందనే అంచనాలు ఉన్నాయి. బౌలర్లు బంతిపై పట్టు కోల్పోతుంటారని, బంతిని సరిగ్గా ల్యాండ్ చేయలేకపోతుంటారని చెబుతుంటారు. అలాంటి పరిస్థితులు బ్యాటర్లకు అనుకూలంగా మారుతుంటాయి. భారీ షాట్లు ఆడటానికి సులభతరమౌతుంది.

ఛేజింగే బలం..
టీమిండియా టీ20 ఫార్మట్ చరిత్రను చూసినా ఛేజింగ్‌తోనే అధిక విజయాలను అందుకుంది. రోహిత్ శర్మ కేప్టెన్సీలో భారత్ గెలిచిన మ్యాచ్‌లల్లో 40కిపైగా అలాంటివే. ప్రత్యర్థి నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడానికే టీమిండియా ఇష్టపడిన మ్యాచ్‌లు చాలా ఉన్నాయి. టీమిండియాకు లక్ష్యాన్ని నిర్దేశించడం అంటే అపజయాన్ని కోరి తెచ్చుకున్నట్టేననే అభిప్రాయం ప్రత్యర్థుల్లో ఉంది. అందుకే- టాస్ గెలిచిన జట్టు తొలుత ఫీల్డింగ్ చేయడానికి మొగ్గు చూపుతుంది.


Click it and Unblock the Notifications
