Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్-పాకిస్తాన్: దుబాయ్ సిద్ధం: వరుణుడు ఆడ్డు? - దానికి అనుకూలించే పిచ్‌పై చెలరేగేదెవరు?

India vs Pakistan, Asia Cup 2022: Weather Forecast And Pitch Report of Dubai Stadium

అబుధాబి: ఎప్పుడెప్పుడా అంటూ ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తోన్న ఆసియా కప్ మెగా టోర్నమెంట్ ఆరంభమైంది. తొలి మ్యాచ్‌లో అనూహ్యంగా ఆఫ్ఘనిస్తాన్ బోణీ కొట్టింది. శ్రీలంకపై తిరుగులేని విజయాన్ని అందుకుంది. గ్రూప్-బీలో అగ్రస్థానంలో నిలిచింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇచ్చింది. ఇప్పుడదే స్టేడియంలో ఈ సాయంత్రం భారత్-పాకిస్తాన్ తలపడనున్నాయి.

అలవోకగా నెగ్గిన ఆఫ్ఘన్..

అలవోకగా నెగ్గిన ఆఫ్ఘన్..

తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 105 పరుగులకే చాప చుట్టేయగా- ఆఫ్ఘనిస్తాన్ 10.1 ఓవర్లల్లో రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఆసియా కప్ టోర్నమెంట్‌లో తన ప్రస్థానాన్ని విజయంతో ఆరంభించింది. శ్రీలంక ఇన్నింగ్‌లో భానుక రాజపక్స-38, లోయర్ ఆర్డర్ బ్యాటర్ చమిక కరుణరత్నె-31 మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ చేశారు. ఏడుమంది బ్యాటర్లు అయిదు చొప్పున పరుగులు కూడా చేయలేకపోయారు.

చిరకాల ప్రత్యర్థుల పోరు..

గ్రూప్-ఏలో భాగంగా ఇవ్వాళ్టి రెండో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ ఢీ కొనబోతోన్నాయి. ఇదే దుబాయ్ స్టేడియంలో ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా బాబర్ ఆజమ్ సేనతో తలపడనుంది. సుదీర్ఘ విరామం అనంతరం ఈ రెండు జట్ల మ్యాచ్ జరగనుంది. దీనికోసం రెండు జట్లూ సన్నద్ధం అయ్యాయి. నెట్స్ ప్రాక్టీస్‌లో చెమటోడ్చాయి. గెలిచి తీరాలనే పట్టుదలను ప్రదర్శిస్తోన్నాయి.

వర్షం పడుతుందా?

వర్షం పడుతుందా?

ఈ మ్యాచ్‌కు వరుణ దేవుడు అడ్డుపడే అవకాశాలు ఏ మాత్రం లేవు. వర్షం పడే సూచనలేవీ లేవని దుబాయ్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణం వేడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రత 38 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రత కూడా34 డిగ్రీల మేర రికార్డ్ అవుతుందని పేర్కొంది. రాత్రి 9 గంటల తరువాత గాలిలో తేమశాతం 34 వరకు ఉండొచ్చు. ఇది లక్ష్యాన్ని ఛేదించడానికి బ్యాటింగ్ చేసే జట్టు జయాపజయాల్లో కీలక పాత్ర పోషిస్తుందనే అంచనాలు ఉన్నాయి.

ఛేజింగ్‌కు అనుకూలం..

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టుకు ఎక్కువ విజయాలను అందించింది. ఇప్పటివరకు దుబాయ్ స్టేడియంలో 74 మ్యాచ్‌లు జరగ్గా ఇందులో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచిన మ్యాచ్‌ల సంఖ్య 39. శ్రీలంక-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌లో కూడా ఇదే రుజువైంది. శ్రీలంక నిర్దేశించిన లక్ష్యాన్ని ఆఫ్ఘనిస్తాన్ అలవోకగా ఛేదించడాన్ని బట్టి చూస్తే- పిచ్ తత్వం ఏమిటనేది అర్థమౌతోంది.

కోహ్లీ వర్సెస్ బాబర్..

సమకాలీన క్రికెటర్లలో విరాట్ కోహ్లీ తరహాలో దూకుడుగా ఆడగలిగే ఏకైక బ్యాటర్ పాకిస్తాన్ కేప్టెన్ బాబర్ ఆజమ్. మరోసారి వీరిద్దరిని మైదానంలో చూడటానికి ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. బాబర్ ఆజమ్‌కు పాకిస్తాన్ విరాట్ కోహ్లీగా పిలుచుకుంటారు ఆ దేశాభిమానులు. అన్ని ఫార్మట్లలోనూ బాబర్‌కు అద్భుతమైన రికార్డ్ ఉంది విరాట్ కోహ్లీలాగే. ఈ మ్యాచ్‌లో ఎవరిది పైచేయి అవుతుందనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్.

Story first published: Sunday, August 28, 2022, 7:19 [IST]
Other articles published on Aug 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+