Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరాట్ కోహ్లీకి వందో టీ20 మ్యాచ్‌: అసలే పాకిస్తాన్..: ఏం చేస్తాడో మరి

India vs Pakistan, Asia Cup 2022: Virat Kohli will be playing his 100th T20I today

దుబాయ్: ఆసియా కప్ మెగా టోర్నమెంట్ రెండో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ ఢీ కొనబోతోన్నాయి. ఈ సాయంత్రమే మ్యాచ్. దుబాయ్ స్టేడియంలో సాయంత్రం 7:30 గంటలకు ఈ హైఓల్టేజ్ మ్యాచ్ ఆరంభం కానుంది. రోహిత్ సేన- బాబర్ ఆజమ్ సారథ్యంలోని పాకిస్తాన్ టీమ్‌తో తలపడనుంది. దీని రిజల్ట్ ఎలా ఉండబోతోందనేది ఉత్కంఠతను రేపుతోంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఫీవర్ ప్రేక్షకులను కమ్మేసింది.

గెలవడం కోసం..

గెలవడం కోసం..

భారత్-పాకిస్తాన్‌ మ్యాచ్ అంటే రెండు దేశాల్లోనూ భావోద్వేగాలు హైపిచ్‌కు చేరుకుంటుంటాయి. అదే పరిస్థితి ఇప్పుడూ కనిపిస్తోంది. దుబాయ్‌లో భారత్-పాకిస్తాన్ అభిమానుల సందడి మొదలైంది. తమ దేశాల జాతీయ పతాకాలతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మీద ఫ్యాన్స్ పోస్టింగులు పెడుతున్నారు. ఫొటోలను షేర్ చేస్తోన్నారు. వారి అంచనాలకు అనుగుణంగా విజయాన్ని సాధించడానికి రెండు జట్లు పక్కా ప్లాన్ రూపొందించుకున్నాయి. నెట్ ప్రాక్టీస్‌లో చెమటోడ్చాయి.

 కోహ్లీకి ప్రత్యేకం..

కోహ్లీకి ప్రత్యేకం..

విరాట్ కోహ్లీకి ఈ మ్యాచ్ ఎంతో ప్రత్యేకమైనది. కేరీర్‌లో చిరస్మరణీయమైనది. ఇది అతని 100వ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్. అది కూడా పాకిస్తాన్‌పై ఆడబోతోండటం దీనికి మరింత స్పెషాలిటీని తీసుకొచ్చింది. అన్ని ఫార్మట్లలోనూ 100 మ్యాచ్‌లను ఆడిన ఏకైక ఆటగాడు కూడా అతనే. వన్డే ఇంటర్నేషనల్స్, టెస్ట్ మ్యాచ్‌లల్లో ఈ మైలురాయిని అధిగమించాడు. ఇప్పుడు టీ20 ఫార్మట్‌లో కూడా వందో మ్యాచ్ ఆడబోతోన్నాడు.

ఎలా ఆడతాడో..

ఎలా ఆడతాడో..

ఫామ్ కోల్పోవడం వల్ల కొంతకాలంగా విమర్శలను ఎదుర్కొంటోన్నాడు కింగ్ కోహ్లీ. ప్రస్తుతం అందరి దృష్టీ నిలిచింది. ఈ టోర్నమెంట్‌లో కోహ్లీ ఎలా ఆడబోతోన్నాడనేది ఆసక్తి రేపుతోంది. కోహ్లీ కేరీర్‌లో ఈ టోర్నమెంట్ అత్యంత కీలకం. ఇందులో గనక విఫలమైతే జట్టులో స్థానం కోల్పోయే ప్రమాదం కూడా లేకపోలేదనే అభిప్రాయాలు సైతం వినిపిస్తోన్నాయి. గడ్డు పరిస్థితులను అధిగమించడానికి కోహ్లీకి ఆసియా కప్ టోర్నమెంట్ ఓ మంచి ప్లాట్‌ఫామ్. నెట్స్‌లో చెమటోడ్చాడు. ఎప్పుడూ లేనివిధంగా రివర్స్ స్వీప్ షాట్లను ప్రాక్టీస్ చేశాడు.

కోహ్లీ రెండోస్థానంలో..

కోహ్లీ రెండోస్థానంలో..

ఆసియా కప్‌లో రెండో ఇన్నింగ్‌లో బ్యాటింగ్‌కు దిగి జట్టును విజయ తీరాలకు చేర్చిన టీమిండియా జట్టులో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. సక్సెస్ ఫుల్ ఛేజింగ్‌లో అతను 494 పరుగులు చేశాడు. 98.80 యావరేజ్ అతని సొంతం. కోహ్లీ కంటే ముందు రోహిత్ శర్మ ఉన్నాడు. 47.75 యావరేజ్‌తో రోహిత్ 522 పరుగులు చేశాడు. ఇక మూడోస్థానం సచిన్ టెండుల్కర్‌దే. 452 పరుగులు చేశాడీ మాస్టర్ బ్లాస్టర్.

Story first published: Sunday, August 28, 2022, 8:52 [IST]
Other articles published on Aug 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+