Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాకిస్తాన్‌తో భారత్ బిగ్ ఫైట్: ఆ పిచ్‌పై సేమ్ గేమ్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా?

 India vs Pakistan, Asia Cup 2022 Super 4: Weather Forecast And Pitch Report of Dubai Stadium UAE

దుబాయ్: ఆసియా కప్ మెగా టోర్నమెంట్‌ సూపర్ 4 దశలో శ్రీలంక శుభారంభం చేసింది. గ్రూప్ దశలో ఏ ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిందో.. అదే జట్టును మట్టి కరిపించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జా స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్- 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేయగా.. శ్రీలంక 19.1 ఓవర్లల్లో లక్ష్యాన్ని ఛేదించింది.

భారత్-పాక్ మధ్య..

భారత్-పాక్ మధ్య..

సూపర్ 4లో రెండో మ్యాచ్ ఇవ్వాళ జరుగనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ ఢీకొట్టనున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం దీనికి వేదిక. భారత కాలమానం ప్రకారం ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. గ్రూప్ దశలో కిందటి ఆదివారం ఈ రెండు జట్లు తలపడిన విషయం తెలిసిందే. పాకిస్తాన్‌పై భారత్ ఏకపక్ష విజయాన్ని సాధించిందా మ్యాచ్‌లో. సరిగ్గా వారం తిరిగే సరికి సూపర్ 4లో మళ్లీ ఈ రెండు జట్లు ఎదురుపడ్డాయి.

కోలుకున్న పాక్..

కోలుకున్న పాక్..

భారత్‌పై పరాజయం పాలైన తరువాత పాకిస్తాన్ కోలుకుంది. తన రెండో మ్యాచ్‌లో హాంకాంగ్‌ను చిత్తు చిత్తు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో పసికూనపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. షార్జా స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 193 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ క్రమంలో రెండు వికెట్లను మాత్రమే కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హాంకాంగ్‌ బ్యాటింగ్ ఆర్డర్‌ను పాకిస్తాన్ బౌలర్లు చెల్లాచెదరు చేశారు. 38 పరుగులకే కుప్పకూల్చారు. బౌలర్ల ధాటికి 155 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది పాక్.

హాంకాంగ్‌పై..

హాంకాంగ్‌పై..

భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ ఈ రేంజ్‌లో చెలరేగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టీమిండియాకు డేంజర్ బెల్స్ మోగించినట్టయింది. పాకిస్తాన్ చేతిలో 38 పరుగులకు కుప్పకూలిన ఇదే హాంకాంగ్ జట్టు.. గ్రూప్ దశలో భారత్‌పై 152 పరుగులు చేసిన విషయం తెలిసిందే. హాంకాంగ్ జట్టును ఆలౌట్ చేయలేకపోయారు టీమిండియా బౌలర్లు. ఈ రెండు మ్యాచ్‌ల మధ్య ఉన్న తేడాను బట్టి చూసుకుంటే.. పాకిస్తాన్‌ దూకుడుగా ఉన్నట్టే.

వాతావరణం ఎలా ఉంది..

వాతావరణం ఎలా ఉంది..

ఈ మ్యాచ్‌కు వర్షం పడే అవకాశాలు ఏ మాత్రం లేవు. వాతావరణం వేడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ మేర రికార్డ్ అవుతుందని వాతావరణం కేంద్రం పేర్కొంది. రాత్రి 9 గంటల తరువాత గాలిలో తేమ 61 శాతం వరకు ఉండొచ్చు. 10 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుంది. ఇది రెండోసారి బ్యాటింగ్ చేసే జట్టు జయాపజయాల్లో కీలక పాత్ర పోషిస్తుందనే అంచనాలు ఉన్నాయి.

ఛేజింగ్‌కు అనుకూలం..

ఛేజింగ్‌కు అనుకూలం..

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టుకు ఎక్కువ విజయాలను అందించింది. గ్రూప్ దశలో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌ కూడా ఇదే విషయాన్ని ప్రూవ్ చేసింది. టాస్ గెలిచిన టీమిండియా కేప్టెన్ రోహిత్ శర్మ మరో ఆలోచన లేకుండా తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అంచనాలకు అనుగుణంగా పాకిస్తాన్‌ను కట్టడి చేశారు. ఇప్పుడు కూడా అదే గేమ్ ప్లాన్‌ను అనుసరించడం ఖాయం. టాస్ గెలిస్తే- తొలుత ఫీల్డింగ్ వైపే మొగ్గు చూపొచ్చు రోహిత్ శర్మ.

Story first published: Sunday, September 4, 2022, 7:14 [IST]
Other articles published on Sep 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+