Sexy: ఆ పదాన్ని పలకలేక నానా తంటాలు పడ్డ రాహుల్ ద్రావిడ్: వీడియో..!!

దుబాయ్: ఆసియా కప్ మెగా టోర్నమెంట్ సూపర్ 4 దశలో రెండో మ్యాచ్ ఇవ్వాళ జరుగనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ ఢీకొట్టనున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం దీనికి వేదిక. గ్రూప్ దశలో కిందటి ఆదివారం ఈ రెండు జట్లు తలపడిన విషయం తెలిసిందే. పాకిస్తాన్‌పై భారత్ ఏకపక్ష విజయాన్ని సాధించిందా మ్యాచ్‌లో. సూపర్ 4లో మళ్లీ ఈ ఆదివారం ఈ రెండు జట్లు ఎదురుపడ్డాయి.

ద్రావిడ్ మనసులో..
ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఈ సాయంత్రం 7:30 గంటలకు ఆరంభమౌతుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సమయం ప్రకారం చూసుకుంటే సాయంత్రం 6 గంటలకు మొదలవుతుంది. ఆసియా కప్ సూపర్ 4 దశలో ఇది రెండో మ్యాచ్. శనివారం రాత్రి జరిగిన తొలి గేమ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై శ్రీలంక ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కీలకమైన ఈ మ్యాచ్‌కు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా దూరం అయ్యాడు. అతని స్థానంలో అక్షర్ పటేల్ జాయిన్ అయ్యాడు. జ్వరం వల్ల పేస్ బౌలర్ అవేష్ ఖాన్ కూడా ఆడే పరిస్థితి లేదు.

పాక్ బౌలింగ్‌పై..
ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఈ విషయాన్ని వెల్లడించారు. అవేష్ ఖాన్ జ్వరం బారిన పడ్డాడని, అందుకే నెట్ ప్రాక్టీస్‌కు కూడా దూరం అయ్యాడని వివరించారు. అదే సమయంలో పాకిస్తాన్ బౌలర్లపై ప్రశంసల వర్షాన్ని కురిపించాడు. బలమైన బౌలింగ్ లైనప్‌ను కలిగివుందని వ్యాఖ్యానించాడు. పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులను సంధిస్తోన్నారని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని చెప్పాడు.

ఫైనల్ రిజల్ట్ ముఖ్యం..
తమ బౌలింగ్ వనరులేమీ తీసిపోవట్లేదని రాహుల్ ద్రావిడ్ చెప్పారు. గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను భారత బౌలర్లు 147 పరుగులకే కట్టడి చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఒక్కోసారి ఒక్కో బౌలర్ 145 నుంచి 147 కిలోమీటర్ల వేగంతో బంతులను సంధిస్తుంటాడని, ఫైనల్ రిజల్ట్ ఏమిటనేది పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని, అదే ప్రధానమని పాకిస్తాన్ బౌలర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
టెక్నిక్స్ అవసరం..
బంతిని ఎంత వేగంతో విసురుతున్నాడు.. దాన్ని స్వింగ్ చేయగలుగుతున్నాడా? లేదా? అనేది ప్రధానం కాదని, ఫలితం ఎలా ఉందనేది మ్యాచ్‌లో ప్రధాన అంశమని రాహుల్ ద్రావిడ్ చెప్పుకొచ్చారు. పాకిస్తాన్‌కు ధీటుగా తమ బౌలింగ్ వనరులు కూడా ఉన్నాయని కాన్ఫిడెంట్‌గా చెప్పగలుగుతానని అన్నారు. టీమిండియా బౌలింగ్ కంటే బలంగానే ఉన్నప్పటికీ.. కొన్ని టెక్నిక్స్ పాక్‌లో లోపించినట్లు చెప్పారు.

సెక్సీ అనే పదాన్ని
బౌలింగ్ గురించి మాట్లాడుతూ సెక్సీ.. అనే పదాన్ని ప్రయోగించబోయి తమాయించుకున్నారు రాహుల్ ద్రావిడ్. తాను ఈ పదాన్ని పలకాలని అనుకుంటున్నప్పటికీ.. అది సరికాదని గట్టిగా నవ్వుతూ వ్యాఖ్యానించారు. నోటి దాకా వచ్చినా దాన్ని బయటపెట్టట్లేదని చెప్పారు. దాని గురించి హింట్ ఇవ్వాలంటూ విలేకరుల ప్రశ్నించగా.. ఎస్ అనే ఇంగ్లీష్ అక్షరంతో మొదలయ్యే నాలుగు అక్షరాల పదమంటూ ద్రావిడ్ దాటవేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications