Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Pakistan: దినేష్ కార్తీక్‌ను జట్టులోకి తీసుకుంటేనే..: తేల్చేసిన సీఎస్‌కే స్టార్

Veteran Indian batsman Robin Uthappa said that Wicket Keeper batter Dinesh Karthik Should Be In The Playing 11.

దుబాయ్: ఆసియా కప్ మెగా టోర్నమెంట్‌ సూపర్ 4 దశలో రెండో మ్యాచ్ ఇవ్వాళ జరుగనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ ఢీకొట్టనున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం దీనికి వేదిక. గ్రూప్ దశలో కిందటి ఆదివారం ఈ రెండు జట్లు తలపడిన విషయం తెలిసిందే. పాకిస్తాన్‌పై భారత్ ఏకపక్ష విజయాన్ని సాధించిందా మ్యాచ్‌లో. సూపర్ 4లో మళ్లీ ఈ ఆదివారం ఈ రెండు జట్లు ఎదురుపడ్డాయి.

ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఈ సాయంత్రం 7:30 గంటలకు ఆరంభమౌతుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సమయం ప్రకారం చూసుకుంటే సాయంత్రం 6 గంటలకు మొదలవుతుంది. ఆసియా కప్ సూపర్ 4 దశలో ఇది రెండో మ్యాచ్. శనివారం రాత్రి జరిగిన తొలి గేమ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై శ్రీలంక ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కీలకమైన ఈ మ్యాచ్‌కు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా దూరం అయ్యాడు. అతని స్థానంలో అక్షర్ పటేల్ జాయిన్ అయ్యాడు.

రవీంద్ర జడేజా అందుబాటులో లేని ప్రస్తుత పరిస్థితుల్లో దినేష్ కార్తీక్‌ను తుదిజట్టులో తీసుకోవాల్సిన అవసరం ఉందని చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ రాబిన్ ఉతప్ప స్పష్టం చేశారు. బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్‌లో జడేజా లేని లోటును అతను తీర్చగలడని వ్యాఖ్యానించాడు. టీ20 ప్రపంచ కప్‌ 2022లోనూ అతణ్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా సమకాలీన క్రికెట్ ఆడుతోన్న ఇద్దరు-ముగ్గురు బ్యాటర్లల్లో దినేష్ కార్తీక్ అత్యుత్తమ ఫినిషర్ అని కితాబిచ్చాడు.

ఇదివరకు ఐపీఎల్ 2022 సీజన్‌, దాని తరువాత ఆడిన టీ20లు, వన్డే ఇంటర్నేషనల్స్‌లల్లో దినేష్ కార్తీక మెరుపులు మెరిపించాడని గుర్తు చేశాడు. వయస్సు మీద పడిందనే ఉద్దేశంతో అతణ్ని బెంచ్‌కు పరిమితం చేయడం సరైన నిర్ణయం కాదని రాబిన్ ఉతప్ప అభిప్రాయపడ్డాడు. ఏజ్ ఫ్యాక్టర్‌ను పరిగణనలోకి తీసుకున్నా కూడా దినేష్ కార్తీక్ బెస్ట్ ఫినిషర్‌గా తేలుతాడని పేర్కొన్నాడు. అలాంటి బ్యాటర్‌కు తుదిజట్టులో ఎందుకు చోటు దక్కదని వ్యాఖ్యానించాడు.

అద్భుతంగా ఆడుతున్న సమయంలో ఆ ప్లేయర్ వయస్సును పరిగణనలోకి తీసుకోవడం సరికాదని రాబిన్ ఉతప్ప పేర్కొన్నాడు. ఆసియా కప్ 2022 టోర్నమెంట్ మాత్రమే కాకుండా వచ్చేనెల ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచ కప్ ఈవెంట్‌కూ అతని ఆటతీరు అతికినట్టు సరిపోతుందని, పక్కా టీ20 ఫార్మట్ క్రికెట్‌ను ఆడే సామర్థ్యం దినేష్ కార్తీక్‌కు ఉందని తేల్చిచెప్పాడు.

Story first published: Sunday, September 4, 2022, 14:20 [IST]
Other articles published on Sep 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+