India vs Pakistan: పాక్ కేప్టెన్‌తో రోహిత్ ముచ్చట్లు - నెట్ ప్రాక్టీస్ మానేసి మరీ..!!

అబుధాబి: ఆసియా కప్ మెగా టోర్నమెంట్ ఇవ్వాళ ఆరంభం కానుంది. గ్రూప్-బీలో శ్రీలంక-ఆఫ్ఘనిస్తాన్ తలపడబోతోన్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోంది. భారత కాలమానం ప్రకారం ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, హాంకాగ్, గ్రూప్-బీలో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఆడనున్నాయి.

భారత్-పాక్ స్పెషల్ అట్రాక్షన్
రెండో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ ఢీ కొనబోతోన్నాయి. ఇదే దుబాయ్ స్టేడియంలో ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా బాబర్ ఆజమ్ సేనతో తలపడనుంది. సుదీర్ఘ విరామం అనంతరం ఈ రెండు జట్ల మ్యాచ్ జరగనుంది. భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే దాన్ని మ్యాచ్‌గా మాత్రమే చూడరు అభిమానులు. ఈ మ్యాచ్ ఫీవర్ అప్పుడే కమ్మేసింది కూడా.

భారత్-పాకిస్తాన్ మధ్య..
భారత్-పాకిస్తాన్ మధ్య జరిగే ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. విజయం భారత్ వైపే మొగ్గు చూపుతుందనే అంచనాలూ ఉన్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు. టీ20 ఫార్మట్‌లో పాకిస్తాన్‌పై భారత్‌దే పైచేయి. ఇప్పటివరకు ఈ రెండు జట్లు తొమ్మిదిసార్లు టీ20 మ్యాచ్‌లల్లో తలపడ్డాయి. ఇందులో ఏడుసార్లు భారత్ విజయఢంకా మోగించింది. రెండుసార్లు మాత్రమే విజయం పాకిస్తాన్‌ను వరించింది.
బాబర్ ఆజమ్‌తో ముచ్చట్లు..
ఈ పరిణామాల మధ్య రోహిత్ శర్మ- పాకిస్తాన్ కేప్టెన్ బాబర్ ఆజమ్ కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రాక్టీస్ సమయంలో ఈ అరుదైన దృశ్యం కనిపించింది. ఆదివారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ఆడాల్సి ఉన్న నేపథ్యంలో ఈ రెండు జట్లు ఇప్పటికే దుబాయ్‌కు చేరుకున్నాయి. నెట్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాయి. ప్రాక్టీస్ ముగించుకుని డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తోన్న సమయంలో ఈ ఇద్దరు కేప్టెన్లు ఎదురుపడ్డారు. సరదాగా మాట్లాడుకున్నారు. ఒకరినొకరు గౌరవించుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications