Hardik Pandya: తప్పులు చేసేలా రెచ్చగొడతా: బౌలింగ్ బలం ఏమిటో బయటపెట్టాడుగా..!!

దుబాయ్: ఆసియా కప్ 2022 టోర్నమెంట్‌లో భారత్ శుభారంభం చేసింది. గ్రూప్- ఏలో భాగంగా దుబాయ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయాన్ని సాధించింది. గెలుపుతో తన ప్రస్థానాన్ని ఆరంభించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. టీ20 ప్రపంచకప్‌లో ఓటమికి ప్రతీకారాన్ని తీర్చుకుంది. గ్రూప్-ఏ అగ్రస్థానంలో నిలిచింది టీమిండియా. ఇక తన తరువాతి మ్యాచ్‌ను ఎల్లుండి ఆడబోతోంది. హాంకాంగ్‌తో తలపడుతుంది.

మారుమోగిపోతున్న పాండ్యా పేరు..
ఈ మ్యాచ్ తరువాత హార్దిక్ పాండ్యా పేరు మారుమోగిపోతోంది. తొలుత బంతితో ఆ తరువాత బ్యాట్‌తో చెలరేగిపోయాడీ ఆల్‌రౌండర్. తన నాలుగు ఓవర్ల కోటాలో 25 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్‌దిల్ షాలను పెవిలియన్ దారి పట్టించాడు. అద్భుతమైన షార్ట్ బంతుల్లో వికెట్లను పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌తో ఏ స్థాయిలో చెలరేగాడనేది ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. 17 బంతుల్లో 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. సిక్స్ కొట్టి జట్టును గెలిపించడం హైలైట్.

షార్ట్ అండ్ హార్డ్ లెంగ్త్..
పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ సందర్భంగా హార్దిక్ పాండ్యా మాట్లాడాడు. తన బలాలేమిటో వెల్లడించాడు. పరిస్థితులను బట్టి తన అస్త్రాలను బయటికి తీస్తుంటానని పేర్కొన్నాడు. షార్ట్ అండ్ హార్డ్ లెంగ్త్ బంతులను సంధించడం తన ప్రధాన బలమని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో అదే ప్రయోగించానని వివరించాడు. వాటిని సమర్థవంతంగా సంధించడం- బ్యాటర్ తప్పులు చేసేలా రెచ్చగొడతానని వ్యాఖ్యానించాడు.

ఓవర్ టు ఓవర్..
ఛేజింగ్ సమయాల్లో ఓవర్ టు ఓవర్‌కు తన ప్లాన్ మారుతుంటుందని, హార్డ్ లెంగ్త్ బంతులను పరిస్థితులను అనుగుణంగా సంధిస్తుంటానని అన్నాడు. బ్యాటింగ్ విషయానికి వచ్చేటప్పటికి.. తాను అనుకున్న ప్లాన్‌ను ప్రశాంతంగా ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నాడు. చివరి ఆరు బంతులకు ఏడు పరుగులు చేయ్యాల్సి వచ్చినా.. 15 పరుగులు అవసరం అయినా- తాను ఒకే విధంగా బ్యాటింగ్ చేస్తానని వివరించాడు.

నవాజ్ వేస్తాడని ఊహించా..
చివరి ఓవర్‌ను నవాజ్ వేస్తాడని ముందే ఊహించానని, దానికి అనుగుణంగా అప్పటికప్పుడు ప్లాన్ వేసుకుని, దాన్ని పక్కాగా ఇంప్లిమెంట్ చేశానని చెప్పాడు హార్దిక్ పాండ్యా. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాటర్ కంటే బౌలర్ ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటాడని, ఓ బౌలర్‌గా తాను అలాంటి పరిస్థితులను చవి చూశానని అన్నాడు. ఒక్క సిక్స్ కొడితే పరిస్థితులన్నీ సర్దుకుంటాయని భావించానని, దాన్ని ఎగ్జిక్యూట్ చేశానని చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications