For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Hardik Pandya: సేమ్ టోర్నీ..సేమ్ పాకిస్తాన్: నాడు స్ట్రెచర్‌పై హాస్పిటల్‌కు - నేడు విధ్వంసకారుడు

India vs Pakistan, Asia Cup 2022: Hardik Pandya getting injured in the 2018, now gets man of the match

దుబాయ్: ఆసియా కప్ మెగా టోర్నమెంట్ గ్రూప్ఏలో భాగంగా దుబాయ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయాన్ని సాధించింది. విజయంతో తన ప్రస్థానాన్ని ఆరంభించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. టీ20 ప్రపంచకప్‌లో ఓటమికి ప్రతీకారాన్ని తీర్చుకుంది. గ్రూప్-ఏ అగ్రస్థానంలో నిలిచింది రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా. తన తరువాతి మ్యాచ్‌ను ఎల్లుండి ఆడబోతోంది. న్యూ కమ్మర్ హాంకాంగ్‌తో తలపడుతుంది.

మారుమోగిపోతున్న పాండ్యా పేరు..

మారుమోగిపోతున్న పాండ్యా పేరు..

ఈ మ్యాచ్ తరువాత హార్దిక్ పాండ్యా పేరు మారుమోగిపోతోంది. తొలుత బంతితో ఆ తరువాత బ్యాట్‌తో చెలరేగిపోయాడీ ఆల్‌రౌండర్. తన నాలుగు ఓవర్ల కోటాలో 25 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్‌దిల్ షాలను పెవిలియన్ దారి పట్టించాడు. అద్భుతమైన షార్ట్ బంతుల్లో వికెట్లను పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌తో ఏ స్థాయిలో చెలరేగాడనేది ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. 17 బంతుల్లో 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఒంటిచేత్తో గెలిపించడం అంటే ఇదే..

ఒంటిచేత్తో గెలిపించడం అంటే ఇదే..

ఈ మ్యాచ్ అతని ఆల్‌రౌండ్ ప్రతిభకు అద్దం పట్టింది. జట్టులో పునరాగమనం తరువాత అతని సత్తాకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. కేరీర్ ముగిసిపోయిందనుకున్న దశ నుంచి జట్టును ఒంటిచేత్తో విజయ తీరాలకు చేర్చిన ఘనతను హార్దిక్ సొంతం చేసుకున్నాడు. భుజానికి శస్త్ర చికిత్స తరువాత ఇక బౌలింగ్ చేయలేడనుకున్న అంచనాలను తలకిందులు చేశాడు. తన విల్ పవర్ ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు.

స్ట్రెచర్‌పై..

స్ట్రెచర్‌పై..

2018లో ఇదే ఆసియా కప్ టోర్నమెంట్‌లో ఇదే పాకిస్తాన్ జట్టుపై మ్యాచ్ ఆడుతూ గాయపడి స్ట్రెచర్‌పై గ్రౌండ్‌ను వీడాడు హార్దిక్. 18వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ఓవర్ 5వ బంతిని సంధించిన తరువాత కాలు జారి కింద పడ్డాడు. నడవలేని స్థితిలో అతన్ని స్ట్రెచర్‌పై తీసుకెళ్లాల్సి వచ్చింది. మిగిలిన ఆ ఒక్క బంతిని అంబటి రాయుడు వేశాడు. వెన్నునొప్పితో చాలాకాలం పాటు బాధపడ్డాడు. 2021 ఆసియా కప్‌లోనూ తన స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోయాడు. అయిదు మ్యాచ్‌లల్లో నాలుగు ఓవర్లు మాత్రమే వేశాడు.

విధ్వంసకారుడిగా..

విధ్వంసకారుడిగా..

అదే హార్దిక్ పాండ్యా.. ఈ ఆసియా కప్‌లో విధ్వంసాన్ని సృష్టించాడు. పాకిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్‌ను చెల్లాచెదురు చేశాడు. చివరి వరకూ క్రీజ్‌లో ఉండి జట్టును గెలిపించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్‌ను సొంతం చేసుకున్నాడు. బంతితో.. బ్యాట్‌తో తనకు తిరుగులేదని మళ్లీ నిరూపించుకున్నాడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న హార్దిక్ పాండ్యా.. ఈ సీజన్‌లో జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టాడు. అదే దూకుడును ఇక్కడా కొనసాగించాడు.

Story first published: Monday, August 29, 2022, 8:14 [IST]
Other articles published on Aug 29, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+