న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాకిస్థాన్‌తో మ్యాచ్: మనీష్ పాండే సూపర్ క్యాచ్‌ని చూశారా? (వీడియో)

Asia Cup 2018: Ind Vs Pak | Manish Pandey's Sensational Catch Stuns Cricket Fans
India vs Pakistan, Asia Cup 2018: Manish Pandey takes a stunner to dismiss Sarfraz Ahmed

హైదరాబాద్: ఆసియాకప్‌లో భాగంగా పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా క్రికెటర్‌ మనీష్‌ పాండే అద్భుత క్యాచ్‌తో ఔరా అనిపించాడు. గాయపడ్డ పాండ్యా స్థానంలో ఫీల్డింగ్‌కు వచ్చిన మనీష్ పాండే ఓ స్టన్నింగ్ క్యాచ్‌ పట్టాడు. కేదార్ జాదవ్ వేసిన ఇన్నింగ్స్ 25వ ఓవర్‌లో సర్ఫరాజ్ అహ్మద్ భారీ షాట్‌కు ప్రయత్నించారు.

పాకిస్థాన్‌తో మ్యాచ్: బౌలింగ్ చేస్తూ.. గ్రౌండ్‌లో కుప్పకూలిన హార్థిక్ పాండ్యాపాకిస్థాన్‌తో మ్యాచ్: బౌలింగ్ చేస్తూ.. గ్రౌండ్‌లో కుప్పకూలిన హార్థిక్ పాండ్యా

వైడ్ లాంగ్ ఆఫ్ నుంచి పరుగెత్తుకుంటూ వచ్చిన పాండే.. బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న మనీష్‌ పాండే పరుగెత్తుకుంటూ వచ్చి అద్భుతంగా బంతిని అందుకున్నాడు. ఈ క్రమంలో బ్యాలెన్స్‌ కోల్పోతున్నట్లు భావించిన పాండే బంతిని గాల్లోకి విసిరేసి బౌండరీ లైన్‌ను దాటి వచ్చి క్యాచ్‌ అందుకున్నాడు.

అత్యంత కష్టమైన క్యాచ్ పాండే పట్టిన తీరు ప్రేక్షకుల్ని అలరించింది. దీంతో సర్ఫరాజ్‌ (6) పెవిలియన్‌ చేరాడు. ఈ మ్యాచ్‌ తుది జట్టులో లేని పాండే ఆల్‌రౌండర్‌ హర్ధిక్‌ పాండ్యా గాయపడటంతో అతని స్థానంలో ఫీల్డింగ్‌కు వచ్చాడు. పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ బౌలర్లు రఫాడిస్తున్నారు. ఆరంభంలో భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు తీశాడు.

షోయబ్ మాలిక్ క్యాచ్‌ మిస్ చేసిన ధోని: భారత్ మూల్యం చెల్లించనుందా?షోయబ్ మాలిక్ క్యాచ్‌ మిస్ చేసిన ధోని: భారత్ మూల్యం చెల్లించనుందా?

1
44050

ఆ తర్వాత బాబర్, షోయెబ్ మాలిక్‌లు హాఫ్ సెంచరీపైగా భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే నిలకడగా కొనసాగుతున్న పాక్ ఆటగాళ్లను వెంటవెంటనే పెవిలియన్‌కు చేర్చారు. అంతకముందు 22వ ఓవర్‌లో కుల్దీప్ బౌలింగ్‌లో బాబర్ ఆజాం ఔటయ్యాడు.

అంబటి రాయుడు సూపర్ త్రో
ఆ తర్వాత ఇన్నింగ్స్ 27వ ఓవ‌ర్‌లో రాయుడు అద్భుత ఫీల్డింగ్ చేశాడు. డైర‌క్ట్ త్రో వేయ‌డంతో.. షోయెబ్ మాలిక్ ర‌నౌట‌య్యాడు. క్రీజులో పాతుకుపోయి.. అప్పటికే ధోని ఇచ్చిన లైఫ్‌తో ప్రమాదకరంగా మారుతున్న మాలిక్‌(43)ను అంబటి రాయుడు అద్బుత ఫీల్డింగ్‌తో పెవిలియన్‌ చేర్చాడు.

కేదార్ జాదవ్‌ వేసిన 27వ ఓవర్‌ చివరి బంతికి మాలిక్‌ (43) లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్‌గా వెనుదిరిగాడు. రాయుడు విసిరిన బంతి డైరెక్ట్‌గా వికెట్లను తాకడం విశేషం. దీంతో పాక్‌ 100 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ వెంటనే అసిఫ్‌ అలీ కీపర్‌ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దీంతో పాక్ వరుస ఓవర్లలో రెండు కీలక వికెట్లను చేజార్చుకుంది.

Story first published: Wednesday, September 19, 2018, 19:51 [IST]
Other articles published on Sep 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X