
హైదరాబాద్: ఆసియా కప్ టోర్నీలో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో భారత్‌కి అద్భుత శుభారంభం లభించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆ జట్టుకి షాకిచ్చాడు.
ఇన్నింగ్స్ 3వ ఓవర్ తొలి బంతికి పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్-హక్ (2) భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. భువనేశ్వర్ విసిరిన షార్ట్ పిచ్ బంతిని క్రీజు వెలుపలికి వచ్చి హిట్ చేసేందుకు ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (2) ప్రయత్నించాడు.
అయితే బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి నేరుగా వెళ్లి వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని చేతుల్లో పడింది. ఈ షాక్ నుంచి కోలుకునేలోపే ఐదో ఓవర్‌లో భువీ మరో వికెట్ తీసి ఆ జట్టుకు షాకిచ్చాడు. గతేడాది ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ సాధించి భారత్‌ని ఓడించడంలో కీలక పాత్ర పోషించిన మరో ఓపెనర్ ఫకార్ జమాన్ ఈ మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు.
ఈ మ్యాచ్‌లో 9 బంతులాడిన ఫకార్ జమాన్ కనీసం పరుగుల ఖాతా కూడా తెరవలేకపోయాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన షార్ట్ పిచ్ బంతిని హిట్ చేసేందుకు అతను ప్రయత్నించగా ఎడ్జ్ తాకిన బంతిని గాల్లోకి లేచింది. దీంతో బౌలర్‌కి సమీపంలో ఫీల్డింగ్ చేస్తున్న చాహల్ ఎలాంటి తడబాటు లేకుండా సులువుగా క్యాచ్‌ని అందుకున్నాడు.
దీంతో పాకిస్థాన్ ఐదు ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయి 4 పరుగులు చేసింది. క్రీజ్‌లో షోయబ్ మాలిక్(1), బాబర్ ఆజాం(1) పరుగులతో ఉన్నారు.