Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: ఫైనల్‌లో గెలుపెవరిది?.. ఏ జట్టు బలంగా ఉంది?.. రాయుడు తీర్పు ఇదే..!

IND vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో టీమిండియా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఆదివారం భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు దుబాయ్ లో జరగనుంది. ఈ సిరీస్‌లో టీమిండియా అపజయం లేకుండా ఫైనల్స్ కు చేరుకోగా.. కానీ న్యూజిలాండ్ జట్టు భారత్ చేతిలో పరాజయం పాలైంది. న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ బలంగా ఉంది. నిజాని టీమిండియాపై ఒత్తిడి తెచ్చిన ఏకైక జట్టు కివీస్ కావడం గమనార్హం. న్యూజిలాండ్ జట్టులో కూడా నలుగురు అద్భుతమైన స్పిన్ బౌలర్లు ఉన్నారు. న్యూజిలాండ్ ఆటగాళ్లు కూడా బ్యాటింగ్ లో రెచ్చిపోయి ఆడుతున్నారు. ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా మారనుంది. ఏ జట్టు ఫైనల్ లో గెలుస్తుందో అంచనా వేయడం కొంచెం కష్టమే.

కానీ ఈ పరిస్థితిలో ఫైనల్ ఎలా ఉంటుందో సీఎస్కే మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అంచనా వేశాడు. ఫైనల్ భారత్ కు కఠినమైన సవాలుగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదని.. రెండు జట్లు బలంగా ఉన్నందున ఈ మ్యాచ్ అభిమానులకు ఒక విందుగా ఉంటుందని అంబటి రాయుడు చెప్పాడు. రెండు జట్లలోనూ మ్యాచ్ ఉన్నారని.. కానీ న్యూజిలాండ్ జట్టులో నలుగురు ఆటగాళ్లు మాత్రమే మ్యాచ్ వినర్లు అని చెప్పుకొచ్చాడు. కానీ భారత జట్టులో మొత్తం 11 మంది ఆటగాళ్లు మ్యాచ్ విన్నర్లేనని పేర్కొన్నాడు. అదనంగా ఇద్దరు ఆటగాళ్లకు అవకాశం లభించకుండా బయట కూర్చున్నారని తెలిపాడు.

India vs Newzealand Who Will Win the Final Ambati Rayudu s Prediction on the Clash

ఇది భారత జట్టు గెలిచేందుకు మంచి అవకాశాన్ని ఇస్తుందని రాయుడు చెప్పాడు. కానీ న్యూజిలాండ్ జట్టులో భారత్ కు ముప్పు కలిగించేది కెప్టెన్ మిచెల్ సాంట్నర్ అని తాను భావిస్తున్నానన్నాడు. సాంట్నర్ తన బౌలింగ్ తో ముఖ్యమైన వికెట్లు తీస్తాడని.. భారత ఆటగాళ్లను చాలా ఒత్తిడికి గురి చేస్తాడన్నాడు. అయితే భారత జట్టులో విరాట్ కోహ్లీ వంటి గొప్ప ఆటగాళ్లు ఉన్నారని.. భారత్ జట్టులోని సీనియర్లు న్యూజిలాండ్ బౌలింగ్ ను అద్భుతంగా ఎదుర్కొంటారని తాను భావిస్తున్నట్లు అంబటి రాయుడు అంచనా వేశాడు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

Take a Poll
Story first published: Thursday, March 6, 2025, 10:34 [IST]
Other articles published on Mar 6, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+