Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Shreyas Iyer:'నాదేం లేదు.. ఇదంతా మా బాస్‌దే' - అయ్యర్ హాఫ్ సెంచరీ బ్యాట్‌పై 'అతడి' పేరు(వైరల్)

Shreyas Iyer Half century: టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తనకు అవకాశం వచ్చిన ప్రతీసారి దంచుతూనే ఉంటున్నాడు. నెం.4 స్థానంలో బ్యాటింగ్ కు దిగినప్పుడల్లా నిలకడగా రాణిస్తున్నాడు అయ్యర్. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్ లోనూ ఒత్తిడి పరిస్థితుల్లో క్రీజలోకి వచ్చి ధనాధన్ తన బ్యాట్ తో దంచేశాడు శ్రేయస్. జట్టు 30/3 కష్టాల్లోకి వెళ్లిపోయిన సమయంలో వచ్చి... 98 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్స్ లతో 79 పరుగులు హాఫ్ సెంచరీ చేశాడు. తద్వారా మిడిలార్డర్ లో తాను బెస్ట్ బ్యాటర్ అని మరోసారి నిరూపించుకున్నాడు.

ఆ పేరు ఎవరిది అంటే?
అయితే అర్ధ శతకం బాదాక బ్యాట్ పైకి లేపి మైదానంలో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు శ్రేయస్ అయ్యర్. అయితే ఆ బ్యాటుపై ఉన్న ఓ పేరు కెమెరా కంటికి చిక్కి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ పేరు మరెవరిదో కాదు.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. శ్రేయస్ అయ్యర్ బ్యాట్ హ్యాండిల్‌కు కింద స్పాన్సర్ స్టిక్కర్ కంపెనీ పేరు ఉంది. అయితే ఆ స్టిక్కర్ పక్కనే చిన్న సైజు అక్షరాల్లో హిట్‌మ్యాన్ అని రాసి ఉండటాన్ని గుర్తించారు క్రికెట్ అభిమానులు. దీంతో ఆరెంజ్ రంగులో ఉన్న హిట్ మ్యాన్ పేరు ప్రస్తుతం తెగ వైరల్ గా మారింది.

India Vs NewZealand Shreyas Iyer hits Half Century with Rohit Sharma Bat in champions trophy 2025

సాధారణంగా రోహిత్.. ఎప్పుడు క్రీజులోకి వచ్చినా బౌలర్ ఎవరు? పిచ్ పరిస్థితి ఏంటి? అనేదే సంబంధం లేకుండా బౌండరీలు, సిక్సులతో విధ్వంసం సృష్టిస్తుంటాడు. అందుకే రోహిత్ శర్మను ఫ్యాన్స్ ముద్దుగా హిట్‌మ్యాన్ అని పిలుస్తుంటారు. ఇప్పుడే ఆ పేరును అయ్యర్ బ్యాట్ పై ఉండడంతో రోహిత్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తనకు రోహిత్ అంటే ఎంత అభిమానమో, అతడి బ్యాటింగ్ తీరు అంటే ఎంత ఇష్టమో.. అయ్యర్ ఈ విధంగా చూపాడు అని కామెంట్లు పెడుతున్నారు.

Story first published: Sunday, March 2, 2025, 18:59 [IST]
Other articles published on Mar 2, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+