Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనిని ఔట్ చేయకపోతే మ్యాచ్‌ గెలవలేం: జేమ్స్ నీషమ్

India vs New Zealand: You havent won the game until you get Dhoni out: Neesham

హైదరాబాద్: భారత జట్టుతో జరిగే ఐదో వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని వికెట్‌ తీయలేకపోతే మ్యాచ్ గెలవడం కష్టమని న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్ అభిప్రాయపడ్డాడు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఐదో వన్డే వెల్లింగ్టన్‌ వేదికగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా నీషమ్ మాట్లాడుతూ "ధోని సత్తా ఏంటో? అతడి రికార్డులే చెప్తాయి. అతను ఓ స్టార్ ప్లేయర్. ఇటీవల భారత్ మీడియాలో ధోనీ 2019 ప్రపంచకప్ ఆడాలా? వద్దా? అనే చర్చ జరిగిన విషయం నాకు తెలుసు. కానీ.. టీమిండియా మిడిలార్డర్‌కి అతనే బలం. మ్యాచ్‌లో ధోనీకి బౌలింగ్ చేస్తుంటే? అతడ్ని ఔట్ చేయనిదే మ్యాచ్‌ గెలవలేం" అని వెల్లడించాడు.

తుది జట్టులో మూడు మార్పులు

తుది జట్టులో మూడు మార్పులు

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ తుది జట్టులో మూడు మార్పులు చోటు చేసుకున్నాయి. తొడ కండరాల గాయం కారణంగా మూడు, నాలుగు వన్డేలకి దూరమైన ధోని ఫిట్‌నెస్ సాధించడంతో మళ్లీ తుది జట్టులోకి వచ్చాడు.

రిజర్వ్ బెంచ్‌కి పరిమితమైన కార్తీక్

దీంతో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ రిజర్వ్ బెంచ్‌కి పరిమితమవగా.. ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ స్థానంలో మహ్మద్ షమీ, మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో విజయ్ శంకర్ జట్టులోకి వచ్చారు. మరోవైపు న్యూజిలాండ్ జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. గాయపడిన ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ స్థానంలో కొలిన్ మున్రో జట్టులోకి వచ్చాడు.

3-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా

3-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా

ఐదు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే నాలుగు వన్డేలు ముగియగా ప్రస్తుతం 3-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా గెలుపుతో సిరీస్‌ని ముగించాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు గత గురువారం జరిగిన నాలుగో వన్డేలో అనూహ్యంగా విజయాన్ని అందుకున్న న్యూజిలాండ్ జట్టు సొంతగడ్డపై ఆఖరి వన్డేలో గెలిచి 2-3తో పరువు నిలుపుకోవాలని భావిస్తోంది.

1
44084
Story first published: Sunday, February 3, 2019, 9:43 [IST]
Other articles published on Feb 3, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+