సరికొత్త రికార్డులు నమోదు చేసిన భారత్‌-న్యూజిలాండ్‌ ఫైనల్‌ మ్యాచ్! అదే కలిసొచ్చిందన్న ఐసీసీ!!

WTC final recorded a total of 177 million audiences across 89 countries

దుబాయ్: క్రికెట్‌లో తొలిసారి నిర్వహించిన ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ (డ‌బ్ల్యూటీసీ) విజయవంతంగా ముగిసిన విషయం తెలిసిందే. నెల రోజుల క్రితం ముగిసిన ఫైనల్లో భారత్‌పై న్యూజీలాండ్ ఘన విజయం సాధించింది. తొలి సీజ‌న్‌ రెండేళ్ల పాటు సాగగా.. అన్ని సిరీస్‌ల కంటే ఎక్కువగా డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌కు వ్యూవ‌ర్‌షిప్ వ‌చ్చిన‌ట్లు తాజాగా ఐసీసీ వెల్ల‌డించింది.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఫైనల్ మ్యాచ్‌ను 17.7 కోట్ల మంది (177 మిలియన్ల వీక్షకులు) చూశారు. లైవ్ వ్యూవ‌ర్లు అయితే గ‌రిష్ఠంగా 13.06 కోట్లు (89 ప్రాంతాల్లో 130.6 మిలియన్ల లైవ్‌ వ్యూయర్‌షిప్‌) కావ‌డం విశేషం. ఇందులో 94.6 శాతంతో ఇండియానే ఎక్కువ వ్యూవ‌ర్ల‌ను అందించింది.

కలిసొచ్చిన స్థానిక వ్యాఖ్యానం

కలిసొచ్చిన స్థానిక వ్యాఖ్యానం

భారత్‌లోనే ఫైనల్‌ను అత్యధిక మంది వీక్షించారని ఐసీసీ తెలిపింది. స్టార్‌స్పోర్ట్స్‌, దూరదర్శన్‌ ద్వారా 94.6% మంది మ్యాచ్‌ చూశారు. స్థానిక భాషల్లోనూ వ్యాఖ్యానం రావడం వ్యూయర్‌షిప్‌ పెరుగుదలకు దోహదపడిందని ఐసీసీ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ అనురాగ్‌ దహియా అన్నారు.

అభిమానులకు మరింత వినోదం కల్పించేందుకు వివిధ వనరులపై పెట్టుబడులు పెడతామని ఆయన వెల్లడించారు. ఇక న్యూజిలాండ్‌లో తక్కువ జనాభా ఉన్నా.. వ్యూయర్‌షిప్‌ ఆకర్షణీయగానే వచ్చింది. దాదాపుగా 200,000 మంది ఫైనల్‌ పోరును వీక్షించారు. వీరందరూ రాత్రంతా మేల్కొని లేదా వేకువ జామునే లేచి మ్యాచును చూడడం విశేషం.

బ్రిటన్‌లోనూ ఇదే రికార్డు

బ్రిటన్‌లోనూ ఇదే రికార్డు

బ్రిటన్‌లోని స్కై స్పోర్ట్స్‌లోనూ 2019-2021 ఛాంపియన్‌షిప్‌ మ్యాచుల్లో అత్యధికంగా వీక్షించిన మ్యాచ్‌ ఇదే. 2015 తర్వాత రిజర్వుడే నాడు అత్యధిక మంది చూసిన ఇంగ్లండ్ యేతర పోరూ ఇదే. ఐసీసీ టీవీ, ఓటీటీ ద్వారా 145 ప్రాంతాల్లో అదనంగా 6,65,100 ప్రత్యక్ష వీక్షణలు వచ్చాయి.

మొత్తంగా 14 మిలియన్ల వీక్షణా నిమిషాలకు ఇది సమానం. రిజర్వుడే రోజు ఐసీసీ వేదికల ద్వారా వీడియో కంటెట్‌ను 500 మిలియన్లకు పైగా చూశారట. ఐసీసీ డిజిటల్‌ అసెట్స్‌లో ఫేస్‌బుక్‌ ద్వారానే 423 మిలియన్ల వ్యూస్‌, 368 మిలియన్ల వీక్షణ నిమిషాలు నమోదయ్యాయి.

Tokyo Olympics 2021: దీపికా కుమారి శుభారంభం.. మూడు సెట్ల‌లోనూ ఆధిప‌త్యం!!

రిజర్వ్‌ డే నాడే

రిజర్వ్‌ డే నాడే

కేవలం ఒక రిజర్వ్‌ డే నాడే ఐసీసీ ఫేస్‌బుక్‌ పేజీలో 24 గంటల వ్యవధిలో 65.7 మిలియన్ల వ్యక్తిగత వీక్షణలు లభించాయి. రిజర్వ్‌ డేలో మ్యాచ్ రసవత్తరంగా సాగడమే ఇందుకు కారణం. మ్యాచ్ డ్రా అనుకున్నా.. కివీస్ పేసర్లు చెలరేగడంతో మ్యాచ్ ఉత్కంఠకు దారితీసింది. ఇక 2020 మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ 64.3 మిలియన్ల కన్నా ఇది ఎక్కవే. ఐసీసీ ఇన్‌స్టా ద్వారానూ 70 మిలియన్ల వ్యక్తిగత వీక్షణలు వచ్చాయి. ఐసీసీ అన్ని డిజిటల్‌ ఖాతాల ద్వారా 515 మిలియన్ల వీడియో వ్యూస్‌ రావడమూ ఓ రికార్డే.

8 వికెట్ల తేడాతో కివీస్ విజయం

8 వికెట్ల తేడాతో కివీస్ విజయం

ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీసేనపై న్యూజిలాండ్‌ 8 వికెట్ల తేడాతో గెలుపొంది తొలిసారి ఛాంపియన్‌షిప్‌ విజేతగా నిలిచింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో కివీస్ అదరగొడితే.. భారత్ మాత్రం చేతులెత్తేసి భారీ మూల్యం చెల్లించుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 217 రన్స్ చేయగా.. కివీస్ 249 పరుగులు చేసింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే కుప్పకూలింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన 32 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని న్యూజిలాండ్‌ 138 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. విలియమ్సన్‌ (52), టేలర్‌ (47) నాటౌట్‌గా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, July 28, 2021, 15:51 [IST]
Other articles published on Jul 28, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X