న్యూజిలాండ్‌తో మ్యాచ్: ప్రపంచ రికార్డుకి చేరువలో విరాట్ కోహ్లీ

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకి చేరువయ్యాడు. ప్రపంచకప్‌లో భాగంగా గురువారం ఇండియా-న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. నాటింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో 57 పరుగులు చేస్తే ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

221 ఇన్నింగ్స్‌ల్లో 10943 పరుగులు
విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 221 ఇన్నింగ్స్‌ల్లో 10943 పరుగులు పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ మరో 57 పరుగులు చేస్తే వన్డేల్లో 11 వేల మైలురాయిని అత్యంత వేగంగా అందుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటి వరకు వన్డేల్లో ఎనిమిది మంది ఆటగాళ్లు మాత్రమే 11 వేల పరుగుల మైలురాయిని అందుకున్నారు.

9వ ఆటగాడిగా కోహ్లీ అరుదైన ఘనత
కోహ్లీ గనుక ఈ మైలురాయిని సాధిస్తే ఈ జాబితాలో 9వ ఆటగాడిగా నిలుస్తాడు. ఇక, టీమిండియా తరుపున ఈ జాబితాలో కోహ్లీ కంటే ముందు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీలు ఉన్నారు. ఇప్పటికే విరాట్ కోహ్లీ వన్డేల్లో అత్యంత వేగంగా పదివేల పరుగుల మైలురాయిని అందుకున్న సంగతి తెలిసిందే.

కోహ్లీ సెంచరీ సాధిస్తే
మరోవైపు ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ సాధిస్తే న్యూజిలాండ్‌పై అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకుంటాడు. కివీస్‌పై వీరేంద్ర సెహ్వాగ్(ఇండియా), రికీ పాంటింగ్(ఆస్ట్రేలియా)లు ఆరు సెంచరీలు నమోదు చేశారు. విరాట్ కోహ్లీ ఐదు సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications