Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

3వ వన్డేలో భారత్ ఓటమి: సిరిస్ 2-1తో నెగ్గిన మిథాలీ సేన

India vs New Zealand: White Ferns beat Mithali Rajs team for consolation win in 3rd ODI

హైదరాబాద్: భారత మహిళల జట్టుతో శుక్రవారం జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్ విజయం సాధించింది. భారత జట్టు నిర్దేశించిన 150 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు 29.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను మిథాలీ సేన క్లీన్‌స్వీప్‌ చేయకుండా న్యూజిలాండ్ అడ్డుకుంది. కాగా, మూడు వన్డేల సిరిస్‌లో ఇప్పటికే మొదటి రెండు వన్డేల్లో మిథాలీ సేన విజయం సాధించి సిరిస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, చివరి వన్డేలో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి మూడు వన్డేల సిరి‌స్‌ను 2-1తో అంతరాన్ని తగ్గించింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా కివీస్ పేసర్ అన్నా పీటర్సన్‌(4/21) ధాటికి భారత జట్టు 149 పరుగులకే ఆలౌటైంది. రెండో వన్డేలో హాఫ్ సెంచరీలతో నాటౌట్‌గా నిలిచిన ఓపెనర్ స్మృతి మంధాన, మిథాలీ రాజ్‌లు త‌క్కువ స్కోరుకే వెనుదిర‌గ‌గా, మిగ‌తా ప్లేయ‌ర్స్ ఎవ‌రు పెద్దగా ఆకట్టుకోలేదు.

దీప్తి శర్మ హాఫ్ సెంచరీ

దీప్తి శర్మ హాఫ్ సెంచరీ

దీంతో 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది. ఈ క్రమంలో దీప్తి శర్మ, హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. నాలుగో వికెట్‌కు 48 పరుగులు జోడించిన అనంతరం హర్మన్‌ను పీటర్సన్‌ పెవిలియన్‌కు చేర్చింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా దీప్తి శర్మ (52; 90 బంతుల్లో, 4 ఫోర్లు) హాఫ్ సెంచ‌రీ చేసింది.

న్యూజిలాండ్ అలవోక విజయం

న్యూజిలాండ్ అలవోక విజయం

ఈ క్రమంలో హాఫ్ సెంచరీ అనంతరం దీప్తి శర్మ కూడా పీటర్సన్‌ బౌలింగ్‌లోనే వెనుదిరిగింది. చివర్లో హేమలత(13), గోస్వామి(12)లు ఫరవాలేదనిపించారు. కివీస్‌ బౌలర్లలో పీటర్సన్‌ నాలుగు, లీ తహుహు మూడు వికెట్లు తీయగా కెర్ రెండు వికెట్లు, కాస్పెరెక్ ఒక వికెట్ తీశారు. అనంతరం టీమిండియా నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని 29.2 ఓవర్లలో రెండు వికెట్లు చేధించింది.

మంధానకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డు

మంధానకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డు

న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లలో సుజే బేట్స్‌ (57), కెప్టెన్ సాటర్త్‌ వెయిట్‌ (66 నాటౌట్‌)లు హాఫ్ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. కివీసే పేసర్ పీటర్సన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్' అవార్డు లభించగా ఈ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా ఓపెనర్ స్మృతి మందానకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌' అవార్డు లభించింది.

Story first published: Friday, February 1, 2019, 14:50 [IST]
Other articles published on Feb 1, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+