For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs New Zealand: తొలి టీ20 ఓటమిపై స్పందించిన రోహిత్ శర్మ

India vs New Zealand : Rohit Sharma Says We Were Outplayed In All Three Departments
India vs New Zealand: We were outplayed in all three departments, says Rohit Sharma

హైదరాబాద్: లక్ష్యాన్ని చేధించే క్రమంలో అన్ని విభాగాల్లోనూ ఘోరంగా విఫలం కావడంతోనే తొలి టీ20లో ఓడిపోయామని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.

అనంతరం 220 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 19.2 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది. దీంతో తొలి టీ20లో టీమిండియా 80 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ "మేం ఏ క్రమంలోనూ లక్ష్యాన్ని చేధించే దిశగా పోరాడలేదు" అని అన్నాడు.

1
44085

"బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ అన్ని విభాగాల్లోనూ విఫలమయ్యాం. భారీ లక్ష్యం చేధించే క్రమంలో ఒత్తిడి గురై వికెట్లు కోల్పోవడం, కనీసం చిన్నపాటి భాగస్వామ్యాలను కూడా నమోదు చేయలేకపోవడం మా ఓటమికి కారణం. గతంలో టీమిండియా భారీ లక్ష్యాలను సులువుగా చేదించింది" అని రోహిత్ శర్మ అన్నాడు.

"ఈ మ్యాచ్‌లో ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్‌తో బరిలోకి దిగినా ఓడిపోవడం బాధించింది. న్యూజిలాండ్‌ అద్భుతంగా ఆడింది. అక్లాండ్‌లో జరగనున్న రెండో టీ20లో మంచి ప్రదర్శణ చేస్తామని ఆశిస్తున్నా. లక్ష్యం ఎంత అన్నది కాదు సాధించాలి, గెలవాలి అనకున్నాం. కానీ గెలవలేకపోయాం" అని రోహిత్ శర్మ చెప్పాడు.

220 పరుగుల లక్ష్యంతో

220 పరుగుల లక్ష్యంతో

220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాలో ఓపెనర్ రోహిత్‌ శర్మ(1) దారుణంగా విఫలమయ్యాడు. జట్టు స్కోరు 18 పరుగుల వద్ద రోహిత్ శర్మ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విజయ్ శంకర్‌తో కలిసి మరో ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ దాటిగా ఆడే ప్రయత్నం చేశాడు.

క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిన శిఖర్ ధావన్

క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిన శిఖర్ ధావన్

కానీ కివీస్‌ బౌలర్‌ ఫెర్గుసన్‌ బౌలింగ్‌లో శిఖర్ ధావన్‌(29) క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన యువ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్(1) తీవ్రంగా నిరాశపరిచాడు. స్కోర్‌ పెంచే క్రమంలో ఒత్తిడికి గురైన ఆల్ రౌండర్ విజయ్‌ శంకర్‌(27) కూడా క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పాండ్యా(4) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు.

139 పరుగులకే ఆలౌట్

ధోనితో కలిసి దూకుడుగా ఆడే క్రమంలో కృనాల్‌ పాండ్యా(20) కూడా కీపర్‌ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అయితే, చివర్లో ధోని(39), భువనేశ్వర్‌(1), చాహల్‌(1)లు వెంటవెంటనే పెవిలియన్‌కు చేరడంతో టీమిండియా 139 పరుగులకే ఆలౌటైంది. తొలి టీ20లో టీమిండియా ఘోరంగా విఫలం కావడంతో అభిమానులు నిరాశ చెందారు.

Story first published: Wednesday, February 6, 2019, 18:01 [IST]
Other articles published on Feb 6, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+