Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ 200, టీమిండియాకు 50: కివిస్‌తో తొలి వన్డే ప్రత్యేకతలివే

హైదరాబాద్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఆదివారం ముంబైలోని వాంఖడే మైదానంలో తొలి వన్డే జరగనుంది. ఈ వన్డేతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన మైలురాయికి చేరువయ్యాడు. న్యూజిలాండ్‌తో జరగనున్న తొలి వన్డే విరాట్ కోహ్లీకి 200వ వన్డే కావడం విశేషం.

తద్వారా ఈ ఘనత సాధించబోతున్న 13వ భారత క్రికెటర్‌గా కోహ్లీ నిలవనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మొత్తంగా చూస్తే రెండోందల వన్డే ఆడుతున్న 72వ క్రికెటర్. ఇప్పటి వరకూ 199 వన్డేలు ఆడిన కోహ్లీ 8, 767 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. యావరేజ్ 55.13 ఉండగా, స్ట్రైక్ రేట్ 91.47గా ఉంది.

రెండో స్ధానంలో కొనసాగుతోన్న కోహ్లీ

రెండో స్ధానంలో కొనసాగుతోన్న కోహ్లీ

ఇక, వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో సెంచరీ చేస్తే మాత్రం పాంటింగ్ రికార్డును కోహ్లీ అధిగమిస్తాడు.

8వ ఆటగాడిగా కోహ్లీ అరుదైన రికార్డు

8వ ఆటగాడిగా కోహ్లీ అరుదైన రికార్డు

వన్డే క్రికెట్‌లో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు బాదిన సిక్సుల సంఖ్య 94. మరో ఆరు సిక్స్‌లు నమోదు చేస్తే భారత్‌ తరఫున 100 సిక్స్‌లు నమోదు చేసిన 8వ ఆటగాడిగా కోహ్లీ అరుదైన రికార్డు సాధిస్తాడు. మరోవైపు టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్‌ శర్మ ఇప్పటివరకు 146 సిక్సులు బాదాడు.

49 విజయాలు సాధించిన భారత్

49 విజయాలు సాధించిన భారత్

మరో నాలుగు సిక్స్‌లు కొడితే రోహిత్‌ భారత్‌ తరఫున 150 సిక్స్‌లు నమోదు చేసిన ఐదో ఆటగాడిగా నిలుస్తాడు. భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య 98 వన్డే మ్యాచ్‌లు జరగ్గా అందులో భారత్ 49 విజయాలు సాధించగా, 43 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఒక మ్యాచ్ టై కాగా, మరో ఐదు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.

వాంఖడెలో టీమిండియాకు మంచి రికార్డు

వాంఖడెలో టీమిండియాకు మంచి రికార్డు

ఇప్పటి వరకు శ్రీలంక(88), వెస్టిండీస్‌(56), ఇంగ్లాండ్‌(52), పాకిస్థాన్‌(52), జింబాబ్వే(51) పైన మాత్రమే భారత్‌ 50కి పైగా విజయాలను నమోదు చేసింది. ఇక, వాంఖడెలో టీమిండియాకు మంచి రికార్డు ఉంది. వాంఖడెలో టీమిండియా 17 వన్డేలు ఆడగా, 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

కివీస్‌పై భారత్‌‌కు మంచి రికార్డు

కివీస్‌పై భారత్‌‌కు మంచి రికార్డు

చివరిసారి ఇక్కడ దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. ఇక స్వదేశంలో న్యూజిలాండ్‌పై టీమిండియాకు మంచి రికార్డు ఉంది. కివీస్‌పై భారత్‌ ఆడిన 23 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించగా, ఏడింట మాత్రమే ఓటమి పాలైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే ఆదివారం ముంబైలోని వాంఖడె స్టేడియంలో మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభం కానుంది.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+