కివీస్ పాత్ర కూడా: మూడో విజయంపై కోహ్లీ ఏమన్నాడంటే!
హైదరాబాద్: మూడు వన్డేల సిరిస్‌ను కోహ్లీసేన 2-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కాన్పూర్‌లోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో ఉత్కంఠభరితంగా ఆదివారం జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సిరిస్ విజయం భారత్‌కు వరుసగా ఏడో సిరిస్ విజయం కావడం విశేషం.

బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు
మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. 'మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి సరైన సమయంలో వికెట్లు తీశారు. ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి ఉండటంతో మూడో వన్డే ఎంతో కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో భారత్ సమిష్టిగా రాణించడంతో విజయం సాధించాం' అని కోహ్లీ అన్నాడు.

మూడు మ్యాచ్‌ల్లో మాకు గట్టి పోటీ ఇచ్చింది
'ఇదొక మంచి గేమ్. క్రెడిట్ మొత్తం న్యూజిలాండ్‌దే. ఈ సిరిస్‌లోని మూడు మ్యాచ్‌ల్లో మాకు గట్టి పోటీ ఇచ్చింది. సిరిస్‌లో మేం అత్యుత్తమ ఆటతీరుని ప్రదర్శించాం. ముఖ్యంగా ఫీల్డింగ్ ఏర్పాటులో బౌలర్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చాను. అందుకే నేను కూడా బౌండరీ లైన్ వద్దే ఉన్నాను' అని కోహ్లీ చెప్పాడు.

ఈ మ్యాచ్‌లో బాగానే ఆడాను
'నా లక్ష్యం ఒకటే. మ్యాచ్ గెలిచి సిరీస్ దక్కించుకోవాలి. ఈ మ్యాచ్‌లో బాగానే ఆడాను. ఇది జట్టుకు అదనపు బలం. ఎలాంటి స్థితిలోనైనా జట్టు విజయం సాధించాలనే భావించాను. నాతోపాటు రోహిత్ కూడా ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. ఇద్దరివి ప్రత్యేకమైనవే. ఈ రోజు నా సెంచరీ వెనుక బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కృషి ఎంతో ఉంది' కోహ్లీ పేర్కొన్నాడు.

చివర్లో తడబాడుకు గురైన న్యూజిలాండ్
కాగా, కాన్పూర్ వన్డేలో 24 బంతుల్లో 35 పరుగులు చేయాల్సిన న్యూజిలాండ్ చివర్లో తడబాడుకు గురైంది. చివరకు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 331 పరుగులు చేసింది. ముఖ్యంగా చివరి ఓవర్ వేసిన బుమ్రా మ్యాజిక్ చేశాడని చెప్పాలి. ఈ మ్యాచ్‌లో 147 పరుగులు చేసిన రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు లభిచంగా, ఈ సిరిస్‌లో రెండు సెంచరీలు చేసిన కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డు లభించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications