
జడేజా అద్భుత ప్రదర్శన చేశాడు:
మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ టీమిండియా బౌలర్లపై ప్రశంసలు కురిపించాడు. 'కివీస్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేయడంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారు. మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేశారు. ఒకవైపు పరుగులు కట్టడి చేస్తూనే.. మరోవైపు వికెట్లు తీశారు. బలమైన న్యూజిలాండ్‌ను స్వల్ప స్కోరుకు కట్టడి చేశాం అంటే.. ఆ ఘనత బౌలర్లదే. రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శన చేశాడు. యుజువేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా సైతం ఆకట్టుకున్నారు. ఫీల్డింగ్‌లోనూ అత్యుత్తమ ప్రదర్శన చేశాం' అని పేర్కొన్నాడు.

సమిష్టి విజయం:
'తొలి ఇన్నింగ్స్‌లో ఈ పిచ్‌పై 160 పరుగులు చేయొచ్చు. మైదానంలోని పరిస్థితులు అర్ధం చేసుకొని పిచ్ ఎలా స్పందిస్తుంది, కివీస్ బ్యాట్స్‌మెన్ ఎలా ఆడుతున్నారనే విషయాలు తెలుసుకోగలిగాం. బ్యాటింగ్ విభాగంలో రాణించాం. లోకేష్ రాహుల్ మరో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయాస్ అయ్యర్ తన దూకుడును ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాడు. అయితే ఛేదనలో కొన్ని తప్పులు జరిగాయి. వాటిపై చర్చించుకుంటాం. ఇది సమిష్టి విజయం' అని కోహ్లీ తెలిపాడు.

ఇంకో మ్యాచ్ గెలవాల్సి ఉంది:
'రెండో టీ20లో జట్టుగా అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన చేశాం. అందుకే రెండు వరుస మ్యాచ్‌లు గెలుపొందాం. కీలక సమయంలో ఆతిధ్య న్యూజిలాండ్ పుంజుకుంటుందని తెలుసు. సిరీస్ గెలవాలంటే.. ఇంకో మ్యాచ్ గెలవాల్సి ఉంది. అందుకు సిద్ధంగా ఉన్నాం. ఆక్లాండ్ మైదాన పరిస్థితుల కన్నా.. హామిల్టన్ వేదిక బాగుంటుందని అనుకుంటున్నా' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

29న మూడో మ్యాచ్:
రెండో టీ20లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 132 పరుగులకే పరిమితమైంది. మార్టిన్ గుప్తిల్ (33), కొలిన్ మన్రో (26), సీఫెర్ట్ (33 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో జడేజా రెండు వికెట్లు సాధించాడు. అనంతరం టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 17.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. రాహుల్ (57), అయ్యర్ (44) మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యం సాధించింది. మూడో మ్యాచ్ ఈ నెల 29న జరగనుంది.


Click it and Unblock the Notifications












