India vs New Zealand: న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్.. కోహ్లీకి బౌల్ట్ హెచ్చరికలు!!

వెల్లింగ్టన్: సుదీర్ఘ న్యూజిలాండ్ పర్యటనలో టీ20, వన్డే సిరీస్‌లు ముగిసాయి. 5-0తో భారత్ టీ20 సిరీస్ గెలవగా.. 3-0తో కివీస్ వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఉంది. ఈ నెల 21 నుండి వెల్లింగ్టన్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఇక వన్డే, టీ20 సిరీస్‌లో పరుగులు చేయలేకపోయిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి టెస్టు సిరీస్ రూపంలో అసలైన సవాల్ ఎదురుకాబోతోంది.

బౌల్ట్ పునరాగమనం:
గాయం కారణంగా ఆరు వారాలు క్రికెట్‌కి దూరంగా ఉన్న కివీస్ సీనియర్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ టెస్ట్ జట్టులో పునరాగమనం చేశాడు. భారత్‌తో జరిగే తొలి టెస్ట్‌కు 13 మంది సభ్యుల న్యూజిలాండ్ జట్టును సోమవారం ప్రకటించగా.. ఫిట్‌నెస్ సంతరించుకున్న బౌల్ట్ చోటు దక్కించుకున్నాడు. అలా సెలెక్ట్ అయ్యాడో లేదో అప్పుడే విరాట్ కోహ్లీని ఔట్ చేస్తానని హెచ్చరికలు జారీ చేసాడు.

కోహ్లీకి హెచ్చరికలు:
తొలి టెస్టు సందర్భంగా పునరాగమనం చేసిన బోల్ట్ మీడియాతో మాట్లాడుతూ... 'విరాట్ కోహ్లీ గొప్ప బ్యాట్స్‌మన్. కోహ్లీ లాంటి అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌ని ఔట్ చేసి మళ్లీ నేను నిరూపించుకుంటా. కోహ్లీని ఔట్ చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. కానీ కోహ్లీ అంత త్వరగా వికెట్ ఇవ్వడు. అతను ఎంత గొప్ప ఆటగాడో అందరికీ తెలుసు. వికెట్ తీయడానికి ప్రయత్నిస్తా' అని అన్నాడు.

కోహ్లీ vs బోల్ట్:
కోహ్లీ, బౌల్ట్ మధ్య గత కొంతకాలంగా ఆధిపత్య పోరు జరుగుతోంది. గత ఏడాది ముగిసిన వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో కోహ్లీని బౌల్ట్ ఔట్ చేసిన విషయం తెలిసిందే. ఈ పోరులో బోల్ట్ ఆధిపత్యం కొనసాగిస్తున్నాడు. ఐదు టీ20లలో 105 పరుగులు, మూడు వన్డేలలో 75 పరుగులే చేసిన కోహ్లీ పూర్తిగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో టెస్టుల్లో ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు జరిగే అవకాశం ఉంది. మరి కోహ్లీ ఇప్పటికైనా గాడిలో పడుతాడేమో చూడాలి.

భారత టెస్ట్ జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, శుభమన్ గిల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, రిషబ్ పంత్, హనుమ విహారి, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, నవదీప్ సైనీ.

కివీస్ టెస్ట్ జట్టు:
జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), బ్లండెల్, బౌల్ట్, గ్రాండ్‌హోమ్, జేమిసన్, లాథమ్, మిచెల్, హెన్రీ నికోల్స్, అజాజ్ పటేల్, సౌథీ, టేలర్, వాగ్నర్, వాట్లింగ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications