బంగ్లాదేశ్‌ను టెస్టు, టీ20 ఫార్మాట్‌లో క్లీన్‌స్వీప్ చేసిన భారత్ స్వదేశంలో మరో సిరీస్‌కు సిద్ధమైంది. బుధవారం నుంచి న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. బెంగళూరు వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించడానికి అవకాశాలు మెరుగుపర్చుకోవాలంటే ఈ సిరీస్ టీమిండియాకు ఎంతో కీలకం కానుంది.
ప్రస్తుతం డబ్ల్యూటీసీలో భారత్ అగ్రస్థానంలో ఉంది. 74.72 విజయశాతం, 98 పాయింట్లతో ఉంది. అయితే న్యూజిలాండ్‌తో సిరీస్ అనంతరం కంగారూల గడ్డపై ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో కివీస్‌పై సిరీస్ గెలిచి ఫైనల్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకోవాలని టీమిండియా పట్టుదలతో సన్నద్ధమవుతోంది.

భారత్ వర్సెస్ న్యూజిలాండ్ టెస్టు సిరీస్ షెడ్యూల్:
తొలి టెస్టు: అక్టోబర్ 16 నుంచి 20 వరకు, బెంగళూరు వేదికగా ఉదయం 9.30 గంటలకు ప్రారంభం
రెండో టెస్టు: అక్టోబర్ 24 నుంచి అక్టోబర్ 28 వరకు, పుణె వేదికగా ఉదయం 9.30 గంటలకు ప్రారంభం
మూడో టెస్టు: నవంబర్ 1 నుంచి నవంబర్ 5 వరకు, ముంబై వేదికగా ఉదయం 9.30 గంటలకు ప్రారంభం
ఫ్రీగా చూడాలంటే..?
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు రిలయన్స్ సంస్థకు చెందిన జియోసినిమా, స్పోర్ట్స్ 18 అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తున్నాయి. స్పోర్ట్స్ 18 శాటిలైట్ ఛానెల్‌లో ఈ సిరీస్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు. అయితే ఈ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జియోసినిమాలో మాత్రం ఫ్రీగా ఈ సిరీస్‌ను వీక్షించవచ్చు. జియోసినిమా వెబ్‌సైట్ ద్వారా ఉచితంగా లైవ్‌ను చూడవచ్చు.
జట్టు వివరాలు
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్).
న్యూజిలాండ్: టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్, మైకేల్ బ్రేస్‌వెల్ (తొలి టెస్టుకు మాత్రమే), మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్, విల్ ఒరుర్కే, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, బెన్ సీర్స్, ఇష్ సోథి (2,3 టెస్టులకు), టిమ్ సౌథి, కేన్ విలియమ్సన్, విల్ యంగ్.