No.4లో ధోని ఎందుకు ఆడాలంటే!: వెల్లడించిన సురేశ్ రైనా

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని బ్యాటింగ్ ఆర్డర్‌లో 4వ స్థానంలో ఆడించాలని వెటరన్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా వ్యాఖ్యానించాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు సాధించి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన ధోని 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డుని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
తొలి రెండు వన్డేల్లోనూ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన ధోని, సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో మాత్రం 4వ స్థానంలో బ్యాటింగ్ చేసి 87 పరుగులతో అజేయంగా నిలిచి భారత్‌ని విజయతీరాలకు చేర్చాడు. దీంతో ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌లోనూ ధోనీని 4వ స్థానంలో ఆడించాలని రైనా పేర్కొన్నాడు.

ఆసీస్ పర్యటనలో రాణించిన ధోని
"ధోని గత రెండు వన్డేల్లోనూ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. టెయిలెండర్లని సమన్వయం చేసుకుంటూ మ్యాచ్‌ను ముగించగల సామర్థ్యం అతడిలో ఉంది. విరాట్ కోహ్లీ నుంచి కూడా ధోనీకి మద్దతు లభిస్తుండటంతో.. స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించగలుగుతున్నాడు. ఏ ఆటగాడికైనా.. కెప్టెన్ నుంచి మద్దతు లభిస్తే చాలు" అని రైనా అన్నాడు.

ధోని ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలడు
"వన్డేల్లో ధోని ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలడు. కానీ వరల్డ్‌కప్ లాంటి టోర్నీల్లో నాలుగో స్థానం ధోని ఆటకు సరిగ్గా సరిపోతుంది" అని సురేశ్ రైనా వెల్లడించాడు. నిజానికి గత ఆరు నెలలుగా నాలుగో స్థానంలో అంబటి రాయుడు అద్బుత ప్రదర్శన చేస్తున్నాడు. అయితే, ఆసీస్ పర్యటనలో ధోని రాణించడంతో ఓపెనర్ రోహిత్ శర్మ కూడా అతడిని 4వ స్థానంలో ఆడించాలని కోరిన సంగతి తెలిసిందే.

శనివారం రెండో వన్డే
ప్రస్తుతం కోహ్లీసేన న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడుతోంది. నేపియర్ వేదికగా బుధవారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఆతిథ్య జట్టుపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండో వన్డే జనవరి 26(శనివారం)నాడు ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications