Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కివీస్ టూర్‌లో ఆ ఒక్క ముప్పుని దాటితేనే విజయం.. గవాస్కర్ వార్నింగ్!

IND vs NZ: న్యూజిలాండ్ పర్యటనలో తమ సత్తా చాటడానికి భారత క్రికెట్ జట్టు పూర్తి స్థాయిలో సిద్ధమైంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో టీ20 సిరీస్‌తో భారత ఆటగాళ్లు ఈ పర్యటనను ప్రారంభించనున్నారు. అయితే ఈ సిరీస్ ప్రారంభానికి ముందే భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ టీమిండియా బ్యాటర్లకు కీలక హెచ్చరిక చేశారు. న్యూజిలాండ్ పర్యటనలో ఎదురయ్యే అతిపెద్ద ముప్పు గురించి సునీల్ గవాస్కర్ ముందుగానే జట్టును అప్రమత్తం చేశారు. ఊ సిరీస్ లో గెలుపోటములు, బ్యాటర్ల ప్రదర్శన అనేది అక్కడ ఉండే వాతావరణంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.

IND vs NZ: వైభవ్‌తో సహా ఐదుగురికి నో ఛాన్స్.. కివీస్‌తో తొలి టీ20లో తుది జట్టు ఇదే!

IND vs NZ: వైభవ్‌తో సహా ఐదుగురికి నో ఛాన్స్.. కివీస్‌తో తొలి టీ20లో తుది జట్టు ఇదే!

వాతావరణ ప్రభావం, స్వింగ్ సవాలు
న్యూజిలాండ్, ఇంగ్లాండ్ వాతావరణ పరిస్థితులు దాదాపు ఒకేలా ఉంటాయని సునీల్ గవాస్కర్ స్పష్టం చేశారు. ఒకవేళ న్యూజిలాండ్‌లో ఆకాశం నిర్మలంగా, పొడిగా ఉంటే బంతి ఎక్కువగా స్వింగ్ కాదు, పిచ్ నుంచి కూడా బౌలర్లకు పెద్దగా సాయం లభించదు. అలాంటి పరిస్థితుల్లో భారత బ్యాటర్లు పరుగులు చేయడం చాలా సులువవుతుంది. అయితే అసలైన పరీక్ష మబ్బులు పట్టినప్పుడే ఎదురవుతుందని సునీల్ గవాస్కర్ హెచ్చరించారు. ఆకాశం మేఘావృతమై, తేమ ఎక్కువగా ఉంటే పిచ్‌పై ఉన్న గడ్డి ఎక్కువ సేపు పసరుగా ఉంటుంది. ఆ సమయంలో బంతి గాల్లో బాగా స్వింగ్ అవుతుంది. ఇది ఏ బ్యాటర్‌కైనా పెద్ద సవాలుగా మారుతుంది.

India vs New Zealand Sunil Gavaskar Warns India Batters About the Biggest Threat on New Zealand Tour
IND vs NZ: భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌లు ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?

Also Read

IND vs NZ: భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌లు ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?

భారత బ్యాటింగ్ ఆర్డర్‌పై నమ్మకం
వాతావరణం అనుకూలిస్తే న్యూజిలాండ్‌లో భారత్ భారీ స్కోర్లు సాధించగలదని సునీల్ గవాస్కర్ ధీమా వ్యక్తం చేశారు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ బలమైన ఓపెనింగ్ జోడీ అని కొనియాడారు. వీరితో పాటు దేవదత్ పడిక్కల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారని, శుభ్‌మన్ గిల్ నైపుణ్యం అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. టీమిండియా తొలి నలుగురు బ్యాటర్లకు ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనే సామర్థ్యం ఉందని, అయితే న్యూజిలాండ్ వాతావరణం వారి ఆటను దెబ్బతీయకుండా ఉండాలని ఆకాంక్షించారు. అక్టోబర్ 22 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో భారత బ్యాటర్లు న్యూజిలాండ్ స్వింగ్ బౌలింగ్ ను ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాల్సిందే.

Story first published: Wednesday, October 21, 2026, 16:09 [IST]
Other articles published on Oct 21, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+