For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs New Zealand: రాహుల్‌ ద్రవిడ్‌ని నమ్మడానికి అదే కారణం.. కోచ్‌గా విజయవంతమవుతాడు: సన్నీ

India vs New Zealand: Sunil Gavaskar Believes Rahul Dravid succeeds as coach

జైపూర్: భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య టీ20 సిరీస్‌కు రంగం సిద్ధమైంది. జైపూర్ వేదికగా మరికొద్దిసేపట్లో తొలి టీ20 జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌, టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ కొత్త ఇన్నింగ్స్‌ని ప్రారంభించబోతున్నారు. ఐపీఎల్‌లో సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న రోహిత్.. ఇండియా-ఏ, అండర్-19 కోచ్‌గా తనదైన ముద్ర వేసిన ద్రవిడ్ కాంబినేషన్‌లో టీమిండియా ఎలాంటి విజయం అందుకుంటుందో చూద్దాం.

వీరిద్దరూ కలిసి జట్టుని ఏ విధంగా ముందుకు తీసుకెళతారనేదిపై భారత మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ స్వభావాలు ఒకే రకంగా ఉంటాయని.. వారి మధ్య సమన్వయం బాగుంటుందని భారత మాజీ క్రికెటర్‌ సునీల్ గావస్కర్ అన్నారు.

ద్రవిడ్‌ని అందుకే నమ్మాను

ద్రవిడ్‌ని అందుకే నమ్మాను

తాజాగా సునీల్ గావాస్కర్ మాట్లాడుతూ... 'రాహుల్ ద్రవిడ్‌ క్రికెట్‌ ఆడుతున్న రోజుల్లో అతడు క్రీజులో ఉన్నంత వరకు భారత బ్యాటింగ్‌కు ఢోకాలేదని భావించేవాళ్లం. అంత నమ్మకంగా ఆడేవాడు. ప్రధాన కోచ్‌గా కొత్త బాధ్యతలను స్వీకరిస్తున్న అతడిని నేను నమ్మడానికి అదే కారణం. ద్రవిడ్‌ కోచ్‌గా విజయవంతమవుతాడని నమ్ముతున్నాను. రాహుల్ ద్రవిడ్, రోహిత్‌ శర్మ స్వభావాలు ఒకేలా ఉంటాయి. ద్రవిడ్‌ లాగే రోహిత్‌ కూడా ప్రశాంతంగా ఉంటాడు. కాబట్టి వారి మధ్య సమన్వయం బాగుంటుందని భావిస్తున్నా. ఎందుకంటే వారిద్దదూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు' అని తెలిపారు.

కోచ్‌గా సక్సెస్‌ అవుతాడు

కోచ్‌గా సక్సెస్‌ అవుతాడు

రాహుల్‌ ద్రవిడ్‌ ఆటగాడిగా, కెప్టెన్‌గా విజయవంతమయ్యాడని.. కోచ్‌గా సక్సెస్‌ అవుతాడని టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. రాహుల్ ద్రవిడ్ గురించి ఆలోచించగానే అతడి కచ్చితమైన ప్రణాళిక, దాని అమలు గుర్తుకు వస్తాయని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు. ప్రస్తుతం కోచ్‌గా అతడు పెద్ద లక్ష్యాలపై దృష్టిని కేంద్రీకరించినందువల్ల, చిన్న చిన్న విషయాలను పట్టించుకోవడం లేదన్నాడు. సునీల్ గావాస్కర్, గౌతమ్‌ గంభీర్, ఆకాశ్‌ చోప్రాలు ఓ షోలో పాల్గొనగా.. ద్రవిడ్‌పై తమతమ అభిప్రాయాలు వెల్లడించారు.

రవిశాస్త్రి కాంట్రాక్ట్‌ ముగియడంతో

రవిశాస్త్రి కాంట్రాక్ట్‌ ముగియడంతో

ఇప్పటికే అనేక మంది యువ ఆటగాళ్లు అండర్‌-19 స్థాయిలో రాహుల్ ద్రవిడ్‌ పర్యవేక్షణలోనే మేటి ఆటగాళ్లుగా తయారైన సంగతి తెలిసిందే. కొందరు ప్లేయర్స్ ఇప్పుడు భారత జట్టులోనూ ఆడన్నారు. టీ20 ప్రపంచకప్‌ 2021 తర్వాత ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రి కాంట్రాక్ట్‌ ముగుస్తున్న నేపథ్యంలో చాలా మంది ద్రవిడ్‌నే తర్వాతి కోచ్‌గా నియమించాలంటూ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షా అతడిని ఒప్పించారు. మరోవైపు ద్రవిడ్‌ ఇటీవల శ్రీలంక పర్యటనలోనూ భారత జట్టు కోచ్‌గా సేవలందించిన సంగతి తెలిసిందే. గ‌తంలో ఇండియా-ఏ జ‌ట్టుకు, శ్రీలంక‌లో ప‌ర్య‌టించిన టీమిండియాకు ద్ర‌విడ్ కోచ్‌గా వ్య‌వ‌హ‌రించాడు.

 సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌, కోచ్

సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌, కోచ్

టీ20 ప్రపంచకప్ 2021 అనంతరం టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకోవడంతో నయా సారథిగా రోహిత్ శర్మ, కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌లను బీసీసీఐ నియమించింది. ఐపీఎల్‌లో సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న రోహిత్.. ఇండియా-ఏ, అండర్-19 కోచ్‌గా తనదైన ముద్ర వేసిన ద్రవిడ్ కాంబినేషన్‌లో టీమిండియా 2022 టీ20 ప్రపంచకప్ టైటిలే లక్ష్యంగా సన్నాహకాలు ప్రారంభించనుంది. జైపూర్‌లో బుధవారం తొలి టీ20 కోసం సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో పిచ్‌ సిద్ధమవుతోంది. భారీ స్కోర్లు ఖాయమని అంటున్నారు. గత ఎనిమిదేళ్లలో ఇక్కడ భారత్ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. ఇక్కడ టీ20 మ్యాచ్‌ జరగడం ఇదే తొలిసారి.

Story first published: Wednesday, November 17, 2021, 17:55 [IST]
Other articles published on Nov 17, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+